జనసేనలో ఉన్నా లాభం లేదు - వీడినా నష్టం లేదు!

Update: 2019-06-13 04:22 GMT
సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు తగిలింది మామూలు దెబ్బ కాదు. ఒక రేంజ్ లో హడావుడి చేసి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. 'జగన్ ఎలా సీఎం అవుతాడో చూస్తా..' అంటూ కాక రేపిన పవన్ కల్యాణ్ ఆఖరికి తనే  ఎమ్మెల్యేగా ఓడిపోయి తన వీరాభిమానులకే గట్టి షాక్ ఇచ్చాడు. ఎన్నికల ఫలితాల రోజున తమ పార్టీ ఎంతగా చిత్తు అయినా కనీసం పవన్ కల్యాణ్ అయినా నెగ్గితే చాలని జనసేన వీరాభిమానులు కోరుకున్నారు. జనసేన లీడింగ్ లో ఉన్న ఒక్క సీటూ పవన్ కల్యాణ్ పోటీ చేసింది అయితే మేలని వారు ఆశించారు.

అయితే వారికి నిస్పృహ కలిగించేలా వచ్చాయి ఫలితాలు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓడిపోయారు. ఆ ఓటమికి ఇప్పుడు ఎన్ని సాకులు అయినా చెప్పవచ్చు. అయితే ఓటమి ఓటమి.

ఇక జనసేన తరఫున పని చేసిన మిగిలిన వారికి కూడా ఇప్పుడు తమ రాజకీయ భవితవ్యం మీద దిగులు పట్టుకున్నట్టుగా ఉంది.

అందులో భాగంగా ఒక్కొక్కరూ జనసేన షిప్ నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే - ఫలితాలు రాకముందే కొందరు  రాజీనామా బాట పట్టగా - ఇటీవల రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో ఎంట్రీ ఇచ్చినట్టే  అని స్పష్టం అవుతోంది.

ఈ నేఫథ్యంలోజనసేన ఆ విషయంలో స్పందించింది. రావెల జనసేనను వీడినా నష్టం ఏమీ లేదని జనసేన తేల్చి చెప్పింది. ఆయనను పార్టీ ఎంతో ఆదరించిందని జనసేన నేతలు అంటున్నారు. పవన్ కల్యాణ్ ఆయనకు సోదర స్థానం ఇచ్చారని - అయినా ఆయన పార్టీని వీడారని జనసేన నేతలు వాపోతున్నారు.

అయినా నేతలు జనసేనలో ఉన్నా పెద్దగా పార్టీకీ - వారికీ లాభం లేదు - వారు జనసేనను వీడినా పార్టీకి పెద్దగా నష్టం లేనట్టుందని విశ్లేషకులు అంటున్నారు!
Tags:    

Similar News