2019 ఎన్నికల్లో జగనే సీఎంః మేకపాటి
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. నెల్లూరులోని ఆయన స్వగృహంలో వైసీపీ ముఖ్యనేతలతో ప్లీనరీ ఏర్పాట్లపై మంగళవారం సమీక్షించారు. ఈ నెల 24వ తేదీ ఆత్మకూరులో జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు.
అధికార టీడీపీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు విజయవంతమయ్యాయన్నారు. వాటికి హాజరయ్యే జనాన్ని చూసి టీడీపీ నాయకులు కలవరపడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తమ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటామన్నారు. ముఖ్యంగా పట్టణంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్లు తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో కలిసి పలు వీధుల్లో పర్యటిస్తామని పేర్కొన్నారు. నెలలు తర బడి డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతుండటంతో పారిశుధ్యం అధ్వానంగా తయారైందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/