జగన్ అమ్ముల పొదిలో తెలంగాణ అస్త్రం

Update: 2019-05-27 06:07 GMT
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడబోతోంది జగన్ ప్రభుత్వం.. ఏపీలో ఎన్నో సమస్యలు. మొన్నటి వరకు తెలుగుదేశం ప్రభుత్వానికి కాపుకాసిన పోలీస్ ఆఫీసర్లపై జగన్ కు నమ్మకం లేదు. చంద్రబాబు ప్రోద్బలంతో వైసీపీ అభిమానులు - నాయకులు - ఎమ్మెల్యేలను ఏపీ పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారు. స్వయంగా వైఎస్ జగన్ సైతం తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పడం సంచలనంగా మారింది.

మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉన్న ఏపీ పోలీస్ బాస్ లపై జగన్ నమ్మకం లేనట్టుంది. అందుకే తెలంగాణ స్టిక్ట్ పోలీస్ ఆఫీసర్ ను ఏపీకి రప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు - ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే కీలకమైన ఇంటెలిజెన్స్  చీఫ్ గా ఏకంగా తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ ను నియమించేందుకు రంగం సిద్ధమైంది.

తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించేందుకు జగన్ నిర్ణయించారు. ఈయన ఐటీ గ్రిడ్ పై ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా ఉన్నారు. కర్తవ్య నిర్వహణలో అత్యంత సమర్థుడిగా స్టీఫెన్ కు పేరుంది. వరంగల్ - రాయలసీమలో పనిచేసినప్పుడు మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల పనిపట్టారు. అంతేకాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెన్నంటి ఉండే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా స్టీఫెన్ రవీంద్రనే చేశారు. అంతేకాదు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఈయనకు పేరుంది.

అందుకే ఏరికోరి వైఎస్ జగన్ తనకు స్టీఫెన్ రవీంద్ర కావాలని.. ఏపీ ఇంటెలిజెన్స్ చీప్ గా నియమించాలనుకున్నారు. కానీ తెలంగాణలో సర్వీసులో ఉండడంతో కేసీఆర్ ను కోరారు. కేసీఆర్ సరేననడంతో ఏపీకి షిఫ్ట్ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టీఫెన్ ను రిలీవ్ చేయడానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై కేంద్రానికి లేఖ రాసిన తర్వాత పూర్తిస్థాయిలో ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Tags:    

Similar News