గ్రామ వలంటీర్లకు జగన్ దసరా కానుక

Update: 2019-10-07 06:45 GMT
గ్రామ స్వరాజ్యమే సంకల్పంగా సచివాలయ వలంటీర్ల వ్యవస్థను గాంధీ జయంతి నాడు ప్రవేశపెట్టిన సీఎం జగన్ తాజాగా వలంటీర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు దాదాపు రెండున్నర లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను నియమించారు. వలంటీర్ల జాబ్ కార్డ్ చూశాక రోజంతా వారు చాకిరీ చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో ప్రస్తుతం వారికి అందిస్తున్న గౌరవ వేతనాన్ని భారీగా పెంచాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం గ్రామ సచివాలయ వలంటీర్లకు ప్రభుత్వం రూ.5వేల గౌరవ వేతనం అందిస్తోంది. వారి సమస్యలు, కష్టాలు గుర్తించిన ప్రభుత్వం వారి వేతనాలను పెంచేందుకు రెడీ అయ్యింది. సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ దసరా కానుకగా గ్రామ సచివాలయ వలంటీర్లకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వలంటీర్లకు ఇస్తున్న రూ.5వేల గౌరవ వేతనాన్ని రూ.8వేలకు పెంచడానికి సిద్ధమయ్యారు. అయితే 8వేలకు మించి పెరిగే చాన్స్ కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సీఎం దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

గ్రామ వలంటీర్లుగా ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. వారికి రూ.5వేలు చాలా తక్కువ అని విమర్శలు వచ్చాయి. దీంతో దసరా కానుకగా వారి వేతనాలు పెంచేందుకు సీఎం జగన్ డిసైడ్ అయ్యారు.
Tags:    

Similar News