• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్‌ తో జగన్...

కేసీఆర్‌ తో జగన్ చెలిమి..?

By - Tupaki Desk
Update: 2018-08-29 01:30 GMT
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరి అంచనాలకు అందదు. అందుకే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఓ నానుడి. కాంగ్రెస్ పార్టీ పతనమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు స్వర్గీయ ఎన్.టీ. రామరావు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆనాడు కాంగ్రెస్‌ పై పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్ది వెంకయ్యనాయుడును గెలిపించేందుకు ప్రచారానికి కూడా వెళ్లారు. ఈ సంఘటనను ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్టీఆర్‌ కు అంతటి వైరముంది. ఆ వైరాన్ని - శత్రుత్వాని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్‌ తో కలిసేందుకు ముందుకు వస్తున్నారు. ఇదీ రాజకీయమంటే. బద్దశత్రువులైన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును ఓడించేందుకు ఒక్కటవుతున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్ మోహన రెడ్డికి ఉమ్మడి శత్రువులైన కాంగ్రెస్‌ తెలుగుదేశం పార్టీలను ఓడించాలని ఉండదా... అని ప్రచారం జరుగుతోంది. వై.ఎస్. రాజశేఖ‌ర రెడ్డిపై అభిమానంతో ఆయన కుమారుడు జగన్ మోహన రెడ్డిపై సానుభూతి చూపిస్తున్నవారు తెలంగాణలో ఎక్కువ మందే ఉన్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ వాసులు ఎన్నో ప్రయోజనాలు పొందారు. అలాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణను వ్యతిరేకించిందనే కోపంతోను ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితీ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికలలో ఖమ్మం లోక్‌ సభ స్థానం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ ఎంపీ తర్వాత టీఆర్ ఎస్ లో చేరారు. ఆయన చేరికకు ముందు పార్టీ అధినేత జగన్ మోహన రెడ్డి అనుమతి తీసుకున్నారు.

ఖమ్మంతో పాటు హైదారబాద్ - నిజామబాద్‌ - కరీంనగర్ జిల్లాలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పట్ల అభిమానం చూపించే వారున్నారు. ఇక సెట్టిలర్లు కూడా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహంగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎం జరుగుతుందోనని భయపడిన సెటిలర్లకు ఎలాంటి  ఇబ్బందులు ఎదురుకాక పోవడంతో  ఈ ప్రభుత్వం పట్ల అనుకూలంగానే ఉన్నారు. పైగా ఈ ఎన్నికలలో సెటిలర్లకు కూడా టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ పట్ల సానుభూతిగా ఉన్నారు. టీఆర్ ఎస్‌ కు తోడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కూడా కలిస్తే తెలంగాణలో ఎన్నికలు యుద్దాన్ని తలపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజలకు కేసీఆర్ పాలనపై గురి కుదిరింది.

అక్కడ కేసీఆర్‌ కు లక్షలాది మంది అభిమానులున్నారు. దీనికి నిదర్శనం కేసీఆర్ ఆంధ్రలో పర్యటించిన ప్రతీసారి అక్కడి వారు చెబుతున్న స్వాగతం - ఇస్తున్న నీరాజనాలే తార్కాణం . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ మోహన రెడ్డి తరఫున నేరుగా ప్రచారం చేయకపోయిన తన అర్దబలాన్ని అంగబలాన్ని జగన్ మోహన రెడ్డికి అందించవచ్చు. ఈ ప్రాతిపదికపై కేసీఆర్ - జగన్ కలసి ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    
  • Jagan 
  • KCR 
  • Telangana Politics 
  • Telugu News 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS