• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చెన్నై త‌గ‌ల‌బ‌డ్తుంటే...

చెన్నై త‌గ‌ల‌బ‌డ్తుంటే అమ్మ అప్లికేష‌న్లు ఇస్తోంది!

By - Tupaki Desk
Update: 2016-09-15 04:40 GMT
కావేరి నీటి విడుదల అంశం తమిళ ప్రజల్లో మరింత ఆవేదనను కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రమైన‌ కర్ణాటకలో ఉన్న తమ బంధుమిత్రుల పరిస్థితిని చూసి త‌మిళ తంబీలు మదనపడుతున్నారు. కర్ణాటకకు పని మీద వెళ్లిన వారి గురించి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కర్ణాటక సరిహదుల్దో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్‌ ను అర్థనగ్నంగా రోడ్డుపై కూర్చోబెట్టి ఆందోళనకారులు కొట్టిన సన్నివేశాలు మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలపై రాజకీయ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రాష్ట్రంలోని కర్ణాటక సంస్థలకు మాత్రం తగిన పోలీసు - సాయుధ దళ బందోబస్తు కొనసాగుతోంది. సదరు సంస్థలు - కార్యాలయాల ఎదుట ఎలాంటి ఆందోళనలు జరగనివ్వకుండా పోలీసు యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కర్ణాటక తీరును ఖండిస్తూ రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు - ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ప‌రిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉండగా త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలిచిన ఆశావహకులను దరఖాస్తు చేసుకోవలసిందిగా అన్నాడీఎంకే అధినేత్రి - ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. శుక్రవారం (ఈనెల 16) నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా ఇందుకు జిల్లాల వారీగా పార్టీ నిర్వాహకులనూ జయలలిత ప్రకటించారు. స్థానిక సంస్థల గడువు అక్టోబరు 24తో పూర్తి కానుండగా ఆలోగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రెండు విడతలుగా అక్టోబరు 17 - 19 తేదీల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమరానికి అధికారిక అన్నాడీఎంకే తొలి అడుగు వేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను కోరుతూ జిల్లాలవారీగా దరఖాస్తులను స్వీకరించే పార్టీ నిర్వాహకులను నియమిస్తూ ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో 16న ఉదయం 8.30 గంటల నుంచి దరఖాస్తుల పంపిణీ ప్రారంభం కానుందని, 22 వరకు ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులను తగిన రుసుము చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 22న రాత్రి 8 గంటల్లోపు సమర్పించాలని పేర్కొన్నారు. చెన్నై నగర పాలక సంస్థ పరిధిలో ఆశావహులకు పార్టీ ప్రధాన కార్యాలయంలో - ఇతర ప్రాంతాలకు జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తులు లభ్యమవుతాయని తెలిపారు. ఎన్నికల విధులను పర్యవేక్షించడానికి మంత్రి ఓ.పన్నీర్‌సెల్వం - లోక్‌ సభ ఉపసభాపతి తంబి దురై, శాసనసభ ఉపసభాపతి పొల్లాచ్చి జయరామన్‌ - ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సెమ్మలై - పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ వేణుగోపాల్‌ లతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

స్థానిక సంస్థల పదవి దరఖాస్తు ఫీజు

కార్పొరేషన్‌ వార్డు కౌన్సిలరు 11,000

మున్సిపల్‌ వార్డు కౌన్సిలరు 5,000

పట్టణ పంచాయతీ వార్డు సభ్యుడు 2,000

జిల్లా పంచాయతీ యూనియన్‌ కౌన్సిలరు 11,000

పంచాయతీ యూనియన్‌ వార్డు కౌన్సిలరు 5,000
Tags:    
  • J Jayalalitha 
  • Applications 
  • Party candidates 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS