ఈ భార్యభర్తల గురించి తెలిస్తే షాక్ తింటారు

Update: 2021-05-23 05:30 GMT
ఆరోగ్యంగా.. సగటు కుర్రాడికి ఏ మాత్రం తీసిపోని అబ్బాయి.. ఆధునికతకు కేరాఫ్ అడ్రస్ గా కనిపించే అమ్మాయి. చూడచక్కని ఈ జంటకు 11 నెలల క్రితమే పెళ్లైంది. కట్ చేస్తే.. వారిద్దరి అంత్యక్రియలు శనివారం రోజు జరిగాయి. తీవ్ర విషాదమే కాదు.. ఈ ఉదంతం గురించి తెలిస్తే.. నోట మాట రాలేని పరిస్థితి. అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లికి చెందిన 30 ఏళ్ల కిరణ్ కు.. 22 ఏళ్ల పూజాకు ఏడాది క్రితం (సరిగ్గా చెప్పాలంటే పదకొండు నెలలు) పెళ్లి జరిగింది. వారిద్దరూ బొమ్మనహళ్లిలోనే కాపురం ఉంటున్నారు. వారిద్దరి అన్యోనతకు కాలానికి కన్ను కుట్టిందో ఏమో.. కిరణ్ కు గుండెకు సంబంధించిన సమస్యలు మొదలయ్యాయి.

దీని చికిత్సలో భాగంగా బెంగళూరు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. దీంతో అతడి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏడడుగులు వేసి.. జీవితాంతం కలిసి ఉంటానని బాసలు చేసిన భర్త పదకొండు నెలలకే దూరం కావటాన్ని పూజ అస్సలు జీర్ణించుకోలేకపోయింది. భర్త అంత్యక్రియల్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన పూజ.. తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు కుటుంబ సభ్యులకు షాక్ తిన్నారు. అప్పటికే ఒక మరణంతో తీవ్ర వేదనలో ఉన్న రెండు కుటుంబాలకు తాజా సూసైడ్ మరింత షాకింగ్ గా మారింది. అన్యోన్య దాంపత్య జీవితానికి నిదర్శనంగా నిలిచిన వీరిద్దరూ ఆకస్మికంగా మరణించిన తీరు అందరి కంట కన్నీటిని తెప్పించింది. ఆమె మృతదేహానికి  అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.
Tags:    

Similar News