కల్కీ భగవాన్ కు షాక్.. ఐటీ దాడులు

Update: 2019-10-16 09:20 GMT
కలియుగ ప్రత్యక్ష దైవమంటూ తనకు తానే చెప్పుకొని దేశంలో పాపులర్ అయిన కల్కీ భగవాన్ పై ఐటీ దాడులు సంచలనంగా మారాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు నిర్వహిస్తుండడం కలకలం రేగింది.

కల్కి భగవాన్ కు ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటకలో భారీగా ఆశ్రమాలతోపాటు పలు సేవా సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. తాజాగా నాలుగు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు కల్కి భగవాన్ కు సంబంధించిన అన్ని ప్రదేశాల్లో సోదాలు జరుపుతున్నారు.

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆశ్రమంతోపాటు తమిళనాడులోని 25 చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్కి అశ్రమాల సీఈవో లోకేష్ దాసాజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కలియుగ దైవంగా చెప్పుకునే కల్కి ప్రజలను అధ్యాత్మికంలో ముంచెత్తి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో కేంద్రఐటీశాఖ ఈ చర్యకు ఉపక్రమించినట్టు తెలిసింది.


Tags:    

Similar News