ఐటీ సోదాలు.. ఆ 150 కోట్లు లోకేష్ వా?

Update: 2019-11-12 11:04 GMT
మౌళిక వసతుల రంగంలో కాంట్రాక్టులకు సంబంధించి భారీ కుంభకోణం ఒకటి బయటపడినట్టుగా ఆదాయపు పన్ను శాఖ వారు ప్రకటించారు. 3,300 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ చెల్లింపులు జరిగినట్టుగా ఐటీ సోదాల్లో బయటపడినట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) ప్రకటించింది. ఇందులో ఏపీ-తెలంగాణలకు సంబంధించిన వ్యవహారాలు ప్రముఖంగా ఉండటం గమనార్హం!

బోగస్ సంస్థలు, బోగస్ కాంట్రాక్టర్లు భారీ ఎత్తున నకిలీ బిల్లులతో నగదు సమకూర్చుకున్నట్టుగా సీబీడీటీ ప్రకటించింది. బోగస్ బిల్లులతో ముడిపడిన భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నట్టుగా సీబీడీటీ వెల్లడించింది.

బోగస్ కంపెనీల తరఫున బిల్లులు పెట్టి డబ్బులు సంపాదించుకున్న వాళ్లు ఏపీకి చెందిన ఒక వ్యక్తికి 150 కోట్ల రూపాయలు చెల్లించుకున్నారని సీబీటీడీ నిర్ధారించడం గమనార్హం. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఒక వ్యక్తికి ఆ డబ్బులు అందాయని వార్తలు వస్తున్నాయి.

హవాలా వ్యాపారులకు, సదరు వ్యక్తికి ఉన్న సంబంధాలు కూడా బయటపడ్డట్టుగా కూడా టాక్ వినిపిస్తూ ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల పేర్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కామ్ ఇది అనే వార్తలు వస్తున్నాయి.

భారీ ఎత్తున కాంట్రాక్టులు చేయకుండా, బోగస్ బిల్లులు పెట్టి డబ్బులు దోచేశారు. అది కూడా ప్రభుత్వ సంబంధ ప్రాజెక్టులకు సంబంధించి అని సీబీటీడీ నిర్ధారించింది. ఏపీకి చెందిన ఒక వ్యక్తికి నూటా యాభై కోట్ల రూపాయలు అందాయని కూడా తేల్చింది. దీంతో తెలుగుదేశం వర్గాల్లో కలకరం రేగుతూ ఉంది.

చంద్రబాబు నాయుడు, లోకేష్.. అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తుండే సరికి, తెలుగుదేశం అభిమానవర్గాల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. ఆ నూటా యాభై కోట్ల వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది. త్వరలోనే నోటీసులు కూడా జారీ కాబోతున్నాయని సమాచారం.
Tags:    

Similar News