• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అఫ్గానిస్థాన్‌ లో ఐసిస్...

అఫ్గానిస్థాన్‌ లో ఐసిస్ దుశ్చర్య.. 100 మంది మృతి

By - Tupaki Desk
Update: 2021-10-09 08:16 GMT
తాలిబన్ల పాలనలో కునారిల్లుతున్న అఫ్గానిస్థాన్‌ లో ఉగ్రవాదులు శుక్రవారం మరో దారుణానికి తెగబడ్డారు. కుందుజ్‌లోని గొజరే సయ్యద్‌ అబద్‌ మసీదు వద్ద షియాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో మసీదులో అధిక సంఖ్యలో షియాలు ప్రార్థనలు జరుపుతున్న సమయంలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది.

పేలుడు తీవ్రతకు పదుల సంఖ్యలో ప్రజలు గాల్లో ఎగురుతూ దూరంగా పడ్డారు. మసీదు ప్రాంగణంలో ఎటుచూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. అప్పటివరకు తమతో పాటు ప్రార్థనలు చేసిన చాలామంది విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి అక్కడివారు తట్టుకోలేకపోయారు. ఆత్మాహుతి ఘటన జరిగిన సమయంలో మసీదులో భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నట్లు కుందుజ్‌ ప్రావిన్స్‌ పోలీసు అధికారి దోస్త్‌ మహమ్మద్‌ ఒబైదా తెలిపారు. షియాల భద్రతకు తాలిబన్లు చర్యలు తీసుకుంటున్నారని, ఇది కచ్చితంగా ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడేనని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఆత్మాహుది దాడి తమ పనేనని ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ ప్రకటించింది. తాలిబన్లకు బద్ధశత్రువుగా మారిన ఈ ఉగ్రవాద సంస్థ అఫ్గాన్‌లో షియా ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ ఇప్పటికే అనేకసార్లు దాడులు చేసింది. అఫ్గాన్‌లో మైనారిటీలుగా ఉంటూ నిత్యం వివక్షకు గురవుతున్న హజారాలు లక్ష్యంగానే తాజాగా దుశ్చర్యకు పాల్పడింది. కుందుజ్‌లో ఉగ్రదాడిని అఫ్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్య సమితి మిషన్‌ తీవ్రంగా ఖండించింది. కుందుజ్‌ ప్రావిన్స్‌ జనాభాలో హజారాలు 6% వరకు ఉన్నారు. ఉగ్రవాదులుగా మార్చేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా వీరినే ఎంచుకుంటోంది. ఐఎస్ మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడటం వారంలో ఇది మూడోసారి కావడం గమనార్హం.




Tags:    
  • Afghanistan 
  • Taliban 
  • Latest news 
  • Latest Updates 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS