కరోనా ఎఫెక్ట్ : తమళనాడు రాజధాని మార్పు !

Update: 2020-07-27 08:10 GMT
తమిళనాడు ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకొని , విలవిలలాడుతుంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో రాజధాని మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదు..గత మూడు దశబ్దాల క్రితం కూడా ఈ అంశం పై చర్చ జరిగింది. తాజాగా మరోసారి ఆ అంశం తెరపైకి వచ్చింది. చెన్నైకి బదులుగా తిరుచ్చిని తమిళనాడుకు రెండో రాజధానిగా మార్చాలని 1982లో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్  ప్రయత్నాలు చేసారు. ఆ తర్వాత చెన్నైలో జనసాంద్రతను తగ్గించేందుకు సబర్బన్ ప్రాంతాలను కలుపుకుని శాటిలైట్ నగరాన్ని అభివృద్ధి చేయాలని డీఎంకే చీఫ్ కరుణానిధి ప్రయత్నించారు.

కానీ , వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ తరువాత అంశం మరుగున పడిపోయింది. చెన్నై నగరం మహానగరంగా మారింది. అప్పట్లో ఎంజీఆర్ ప్రయత్నాలు కనుక ఫలించి ఉంటే నావల్‌పట్టు ప్రాంతం ప్రస్తుతం తమిళనాడు రాజధానిగా ఉండేది. ప్రస్తుతం చెన్నై లో కరోనా  విజృంభణ కొనసాగుతున్న సమయంలో మళ్లీ రాజధాని మార్పు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎంజీఆర్ ప్రతిపాదించినట్టుగా తిరుచ్చిని ఆనాడు రాజధానిని చేసి ఉంటే కనుక 90 వేల మంది రాజధాని వాసులు కరోనా కోరల్లో చిక్కుకుని ఉండేవారు కాదని నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News