• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విరాట్ కోహ్లీ, బీసీసీఐ...

విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య ఏదో జరుగుతోందా?

By - Tupaki Desk
Update: 2021-09-19 05:32 GMT
విజయవంతంగా జట్టు  ముందుకు సాగినంత వరకూ ఆడింది ఆట..పాడింది పాటగా ఉంటుంది. అదే తేడా కొట్టిందే అంతే సంగతులు.. ఈ విషయం తెలుసు కాబట్టే.. ఫాం కోల్పోయిన ఎంఎస్ ధోని కెప్టెన్సీ పగ్గాలు వదులుకొని ఉన్న ఫళంగా నాడు సూపర్ ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పజెప్పాడు. దీంతో భారత క్రికెట్ లో నాడు నాయకత్వ బదిలీ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ప్రశాంతంగా సాగింది.

అయితే ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీ ఫాం కోల్పోయాడు. అతడి సారథ్యంలో టీమిండియా ఒక్క ఐసీసీ ప్రపంచకప్ కూడా గెలవలేదు. ధోని సారథ్యంలో నెగ్గిన ట్రోఫీలే ఇప్పటిదాకా ఉన్నాయి. 2013 నుంచి టీమిండియా ఒక్క కప్ కూడా గెలవలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా.. టీమిండియా తరుఫున విజయాలను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది. ఈ విషయం చెప్పడంతోనే ప్రపంచ టీ20 కప్ వరకు తనకు అవకాశం ఇవ్వాలని కోహ్లీ అడిగాడని.. అందుకే ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి దిగిపోనున్నట్టు తెలిపారు.

ఈ పరిణామాలన్నీ చూశాక టీమిండియా కెప్టెన్ కోహ్లీ, బీసీసీఐ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడినట్లు అనిపిస్తోందని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నారు.  ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడని అనిపిస్తోందన్నారు.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐకి మధ్య విభేదాలున్నాయని.. దాంతోనే కోహ్లీ టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని అనుమానం కలుగుతోందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. కోహ్లి ఒకటి చెబితే బీసీసీఐ మరొకటి చెబుతుందని అనుకోలేమని అంటున్నారు.

అయితే కోహ్లీ లాంటి ప్రపంచ బ్యాట్స్ మెన్ ఏ జట్టుకు లేదు. భారత్ క్రికెట్ కు కోహ్లీ గొప్ప ఆస్తి. కోహ్లీ తీసుకున్న నిర్ణయం అతడి బ్యాటింగ్ ను మెరుపరిచేందుకు సహకరిస్తుంది.. విరాట్ టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినా దేశం తరుఫున పరుగులు చేస్తూనే ఉండాలి. కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అందుకునేందుకు రోహిత్ శర్మకు మించిన అర్హుడు మరొకరు లేరు అని సందీప్ పాటిల్ లాంటి క్రికెట్ మాజీలు కూడా చెబుతున్నారు.
Tags:    
  • Virat Kohli 
  • BCCI 
  • Team India 
  • Latest News 
  • Cricket News 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS