రూ.2వేల నోటు అంటే మోడీకి మొదట్నించి ఇష్టం లేదా?
పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీ.. తాను రద్దు చేసిన పెద్ద నోట్లకు మించిన స్థాయిలో రూ.2వేల నోటును తెర మీదకు తేవటం తెలిసిందే. దీనిపై పలువురు విమర్శలు కూడా చేశారు. వెయ్యి నోటు తీసేసి.. దాని స్థానే రూ.2వేల నోటు తీసుకురావటం అర్థం లేనిదన్న వాదనలు వినిపించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్తగా తీసుకొచ్చిన రూ.2వేల నోటు మీద తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.
నిత్యం వార్తల్లో నిలిచే రూ.2వేల నోటుకు సంబంధించి తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ నిర్ణయం తీసుకున్న తర్వాత.. దాని స్థానే తీసుకురావాల్సిన నోట్ల గురించి ఆయన అభిప్రాయానికి భిన్నంగా జరిగిందా? అంటే అవునని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన రూ.2వేల నోటును తీసుకురావటం ప్రధాని మోడీకి ఏ మాత్రం ఇష్టం లేదట.
ఒక దశలో అయితే.. ఆయన రూ.2వేల నోటుకు నో చెప్పినట్లుగా ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు మోడీతో కలిసి పని చేసిన మిశ్రా. 2014 నుంచి 2019 వరకు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన మిశ్రా తాజాగా ఒక పత్రికకు ఒక ఆర్టికల్ రాశారు. అందులో రూ.2వేల నోటును ప్రింట్ చేయాలన్న నిర్ణయాన్ని మోడీ వ్యతిరేకించినట్లుగా పేర్కొన్నారు.
రూ.2వేల నోటు తీసుకు రావటం మోడీకి ఇష్టం లేదని.. కాకుంటే అప్పట్లో జరిగిన పరిణామాలకు అనుగుణంగా ఆయన ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ కారణంతోనే కావొచ్చు.. రూ.2వేల నోటు ముద్రణను నిలిపివేయటంతో పాటు.. క్రమ పద్దతిలో రూ.2వేల నోటు చలామణిని తగ్గించాలన్నట్లుగా మోడీ తీరు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.