• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈఎస్ ఐ స్కాంలో మరో మంత్రి...

ఈఎస్ ఐ స్కాంలో మరో మంత్రి లోకేష్ నేనా?

By - Tupaki Desk
Update: 2020-06-12 04:15 GMT
అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభానికి ముందు ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. టీడీపీకి జగన్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఈఎస్ ఐ స్కామ్ లో ఆరునెలలుగా విచారణ చేస్తున్న ఏసీబీ పక్కా ఆధారాలతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఉన్న అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

*200 కోట్ల స్కామ్ లో వైద్యుడు కీలకం..

2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పనిచేశారు. 2017వరకు అదేశాఖలో కొనసాగారు. తెలంగాణలో ఈఎస్ఐ అధికారి దేవికారాణి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఏపీలోనూ ఈఎస్ ఐ స్కాం వ్యవహారాలపై సీఎం జగన్ విజిలెన్స్ తో విచారణ చేయించారు. విచారణలో భాగంగా తిరుపతిలోని ఓ వైద్యుడు ఇచ్చిన సమాచారం కీలక సమాచారం ఆధారంగా తీగలాగితే డొంక కదిలింది. మంత్రి పేషీ నుంచి వచ్చిన వత్తిళ్ల కారణంగా ఈ స్కాంలో నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఖరారు చేయించారని విచారణలో తేలింది.  కాంట్రాక్టులు లేని కంపెనీలకు ఈఎస్ ఐ డైరెక్టర్లు రూ.51 కోట్లు చెల్లించినట్టు దర్యాప్తులో తేలింది.

*136శాతం అధిక ధరలు చెల్లింపు

ఏసీబీ ఈ విచారణలో పక్కా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. మందులు పరికరాలు వాస్తవ ధరకంటే 136శాతం అధికంగా ధరలు చెల్లించినట్టు ఆధారాలతో సహా ఏసీబీ నిరూపించింది. అచ్చెన్నను అరెస్ట్ చేసింది.

*స్కామ్ లో మరో మాజీ మంత్రి లోకేష్ ప్రమేయంపై ఆరా?

ఈఎస్ఐ కొనుగోళ్ల టెండరింగ్ లో అచ్చెన్నాయుడితోపాటుగా మరో మాజీ మంత్రి ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమికంగా తేల్చారు. నామినేటెడ్ పనులును ఇచ్చి హవాలా ద్వారా డబ్బులు తరలించారు అని అనుకుంటున్నారు. నామినేటెడ్ వర్క్స్ ఇవ్వండి అని చెప్పింది మాజీ మంత్రి లోకేష్ అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. అచ్చెన్నను అరెస్ట్ చేసిన ఏసీబీ ఇప్పుడు మాజీ మంత్రి కుటుంబసభ్యులను విచారించనున్నట్టు తెలుస్తోంది.  అచ్చెన్న ఆదేశాల మేరకు నాడు డీఐఎంఎస్ డైరెక్టర్ రమేష్ కుమార్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్టు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ ఈఎస్ఐ స్కాంలో 155 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మాజీ మంత్రి సైతం ఏసీబీ వలలో చిక్కుకున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Tags:    
  • Nara Lokesh 
  • ESI Scam 
  • ACB Raids 
  • Andhra Politics 
  • Political updates 
  • Telugu News 

Similar News

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

Copyright @2026

Powered by Blink CMS