ఎన్నికల్లో చెల్లి గెలుపు కోసం అంత కష్టపడుడా కేటీఆర్?
త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం టీఆర్ఎస్ కష్టపడటం.. అందుకోసం భారీ ఎత్తున వ్యూహాల్ని సిద్ధం చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మిగిలిన ఎన్నికల్ని సింఫుల్ గా తేల్చేసే గులాబీ పార్టీకి పట్టభద్రుల ఎన్నిక ఒక పట్టాన కొరుకుడుపడదు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది కూడా. అందుకే.. ఈసారి ఆ లోపాన్ని అధిగమించేందుకు అందరి కంటే ముందుగా కళ్లు తెరవటమే కాదు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు ఇలా అందరూ తలో చేయి వేస్తున్నారు.
ఇంతవరకు ఓకే. కానీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కవిత కోసం ఆమె సోదరుడు కేటీఆర్ కష్టపడుతున్న వైనం మాత్రం విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నిక ఏదైనా సరే.. తన ముద్ర ఉందన్న భావన కలిగించేందుకు తారక రాముడు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా కల్వకుంట్ల కవితను భారీ మెజరా్టీతో గెలిపించుకుందాంమంటూ వీడియో కాన్ఫరెన్సు ఏర్పాటు చేసి మరీ చెప్పారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్ పార్టీవే. ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె మనసును ఊరడించేందుకు వీలుగా.. గులాబీ బాస్ కమ్ ఆమె తండ్రి కేసీఆర్ ఎంతో ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దించేందుకు డిసైడ్ అయ్యారు. ఏ విధంగా చూసినా కవిత గెలుపు ఖాయమే కాదు.. మంచి మెజార్టీ పక్కా.
అయినప్పటికీ.. భారీ మెజార్టీ సాధించటమే లక్ష్యమన్నట్లుగా కేటీఆర్ చెబుతున్న మాటలు విస్మయానికి గురి చేస్తున్నాయి. పట్టభద్రుల ఎన్నికల కోసం కష్టపడటంలో అర్థం ఉందని.. గెలుపు కన్ఫర్మ్ అయిన ఎన్నిక విషయంలోనూ ఇంతలా కష్టపడాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న వారి నోటి నుంచి వినిపిస్తోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను గుర్తు చేసేలా.. గెలుపు ఖాయమైన ఎన్నికను సైతం భారీ మెజార్టీ రావాలన్న టార్గెట్ మాట చెప్పటం ద్వారా క్యాడర్ లో మరింత హుషారు పుట్టించటమే కేటీఆర్ లక్ష్యమన్నట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.