భారత క్రికెటర్లు స్వార్థపరులు: పాక్ దిగ్గజం

Update: 2020-04-24 00:30 GMT
భారత క్రికెటర్ల వైఖరిని తూర్పార పట్టారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ అయిన ఇంజమాముల్ హక్. తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెటర్లు జట్టు కోసం కాకుండా స్వార్థంగా ఆడేవారని సంచలన ఆరోపణలు చేశారు.

భారత క్రికెటర్లు ఎప్పుడూ వ్యక్తిగత రికార్డులే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తారని.. కానీ పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ మాత్రం జట్టు ప్రయోజనాల కోసమే ఆడేవారని ఇంజమామ్ తెలిపారు. కేవలం జట్టు గెలుపే లక్ష్యంగా పాకిస్తానీలు ఫీల్డ్ లో ఆడేవారన్నారు.

భారత జట్టులో ఒకసిరీస్ లో ఆడితేనే మరో సిరీస్ లో జట్టులో చోటు ఉంటుందని.. అందుకే వారంతా జట్టు కోసం కాకుండా సెంచరీల కోసమే ఆడేవారన్నారు. కాగితపు పులులుగా బ్యాంటింగ్ బలంగా కనపడేదని.. కానీ వారంతా వ్యక్తిగత ప్రదర్శనకే ప్రాముఖ్యతనిచ్చేవారని.. జట్టు ఓడిపోతున్నా వారికి పట్టేది కాదని ఆరోపించారు.

నాడు భారత క్రికెటర్ల వలే.. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా తయారయ్యారని ఇంజమామ్ ఆరోపించారు. ప్లేసుల కోసం కుస్తీ పడకుండా ఆటలపై జట్టు పటిష్టం కోసం ఆడాలన్నారు. పూర్తి స్థాయి ప్రదర్శన చేయాలని భయపడుతూ ఆడొద్దని ఇంజమామ్ హితవు పలికారు.
Tags:    

Similar News