బయటపడ్డ మరో కొత్త వైరస్ .. ఎలా వ్యాపిస్తుందంటే !
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుతు రోజురోజుకి మరింత వేగంగా విస్తరిస్తూపోతుంది. ఈ కరోనా దెబ్బకి కొన్ని దేశాల్లో ప్రజలు తమ ఇళ్లల్లో నుండి బయటకి రావాలన్న కూడా భయంతో వణికిపోతున్నారు. ఇటువంటి సమయంలోనే మరో కొత్త వైరస్ రావడంతో ..ఇప్పటికే కరోనా నుండి ఎలా బయటపడాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలు ఈ కొత్త వైరస్ వస్తుంది అని తెలియడంతో షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో అంతుచిక్కని వైరస్ ప్రభలడంతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. చిక్ సీడ్ తయారు చేస్తున్న కంపెనీల ప్రతినిధులు విజయవాడ , హైదరాబాద్ లోని ల్యాబ్ లకు తీసుకువెళ్లి టెస్టులు చేసినప్పటికీ , ఆ వైరస్ ను అరికట్టే వాక్సిన్ ను కనిపెట్టలేక పోతున్నారు.
అయితే , ఇప్పుడు అలాంటి పరిస్థితులే కేరళలో కూడా నెలకున్నాయి. అయితే అక్కడ కోళ్లు మాత్రమే కాదు గబ్బిళాలు కూడా చనిపోవడం ప్రజలను ఆందోళనకి గురిచేస్తుంది. కేరళలోని కొజిక్కొడె జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే జంతు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి చనిపోయిన గబ్బిళాల నుంచి శాంపిల్స్ సేకరించారు.పరీక్షల కోసం చనిపోయిన గబ్బిలాల నుండి నమూనాలను సేకరించారు. చనిపోయినవాటిన్నింటిని కాల్చి బూడిద చేశారు. పరీక్ష ఫలితాలకు కొన్ని రోజులు సమయం పడుతుంది 'అని జిల్లా పశుసంవర్ధక అధికారి డిఆర్ కెవి ఉమా అన్నారు.
కొజిక్కెడ్ జిల్లాలో రెండు పౌల్ట్రీ ఫామ్స్‌లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోళ్లు వందల సంఖ్యలో చనిపోవడంతో టెస్టులు చేసిన అధికారులు.. Type-A Influenzaకు సంబంధించిన H5, H7 వైరస్ అందుకు కారణంగా నిర్ధారించారు. దీంతో వెంటనే అలర్టయిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్, ఆ కోళ్ల ఫామ్స్‌కు ఒక కిలోమీటర్ పరిధిలో సంచరిస్తోన్న 1200వరకు రకరకాల పక్షుల నమూనాలను సేకరించారు. ఆ కోళ్ల ఫారం నుంచే వైరస్ గబ్బిలాలకు సోకిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అలాగే ముందు జాగ్రత్తగా .. ఆ ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరం వరకూ షాపుల్లో కోళ్లను, గుడ్లను అమ్మకాలను నిషేదించారు. అలాగే ప్రభుత్వం నష్టపోయిన వారిని ఆడుకుంటుంది అని హామీ ఇచ్చారు.