• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా వ‌ద్దు..అంటున్న...

అమెరికా వ‌ద్దు..అంటున్న భార‌త విద్యార్థులు

By - Tupaki Desk
Update: 2017-03-17 14:15 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేస్తున్న వలస ఆదేశాలు సృష్టించిన ఉద్రిక్తత కారణంగా భారతీయులతో సహా పలుదేశాలకు చెందిన విద్యార్థులు - ఉద్యోగార్థులు వేరే దేశాలకు వెళ్లిపోవడం గురించి ఆలోచిస్తున్నట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. హెచ్1బీ వీసాల సత్వర పరిశీలన కార్యక్రమాన్ని ట్రంప్ సర్కారు ఆరుమాసాల పాటు నిలిపివేయడం ఈ ధోరణికి కారణం. వలసదారులపై బిగింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అమెరికాలో చదువు కొనసాగించడం - ఉపాధి కోసం ప్రయత్నించడం అంత మంచిది కాదని చాలామంది భావిస్తున్నారు. ఇక్కడ ఏమాత్రం భద్రత లేదని, అందుకే కెనడా వెళ్లిపోతున్నానని ఓ ఇరానీ విద్యార్థి చెప్పాడు. మరోవైపు ఈ గందరగోళం వల్ల అమెరికాకు వచ్చే ప్రతిభావంతులు తగ్గిపోతారని యూనివర్సిటీలు వాపోతున్నాయి. అమెరికాలో చదువుకున్నవే సైన్స్, ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 45 శాతం మంది భారత్ వంటి విదేశాల నుంచి వచ్చినవారే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక ప్రస్తుతం అమెరికాలోని పరిస్థితులు చూస్తే ‘స్టెల్లా’ మంచుతుపాను తాకిడికి అమెరికా ఈశాన్య ప్రాంతం అతలాకుతలమయింది. మంచు తుపాను ధాటికి వేలాది విమాన సర్వీసులు రద్దు కాగా, స్కూళ్లు - దుకాణాలు మూతపడ్డాయి. అయితే ముందు భయపడినట్లుగా న్యూయార్క్ - వాషింగ్టన్ నగరాలపై ఈ తుపాను తీవ్రత పెద్దగా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కనెక్టికట్ - మసాచుసెట్స్ రాష్ట్రాల్లో మాత్రం ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్ నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దాదాపు 76 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. అయితే 84 లక్షల జనాభా కలిగిన న్యూయార్క్ నగరంలో హిమపాతం తక్కువగా ఉండడంతో ప్రమాద హెచ్చరికలను రద్దు చేశారు. వాషింగ్టన్ - న్యూయార్క్ నగరాల్లో వాతావరణం ప్రమాదస్థాయిలో ఉంటుందన్న హెచ్చరికల కారణంగా వాషింగ్టన్‌ లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగాల్సిన సమావేశం శుక్రవారం దాకా వాయిదా పడిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఉష్ణోగ్రతలు నీళ్లు గడ్డే కట్టే స్థాయికన్నా దిగువకు పడిపోవడంతో రోడ్లు - ఫుట్‌ పాత్‌ లపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. దీంతో బుధవారం తెల్లవారు జాము దాకా నగరవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

న్యూయార్క్ సబ్‌ వే - బస్ సర్వీసులు నడుస్తున్నప్పటికీ పాఠశాలలు - దుకాణాలు - వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డంతో పాటుగా జనం ఇళ్లలోంచి బైటికి రాకపోవడంతో నగరమంతా బోసిపోయి కనిపిస్తోంది. జాన్ ఎఫ్.కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా ఇతర విమానాశ్రయాలు సైతం మూతపడ్డాయి. రన్‌వేలపైన పేరుకుపోయిన మంచును తొలగించడంలో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. బోస్టన్ వైపు వెళ్లే రైళ్లన్నిటినీ రద్దు చేశారు. రైళ్లు కూడా రద్దు కావడంతో చాలామంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో చిక్కుపడిపోయారు. న్యూయార్క్‌ లోని ఐరాస ప్రధాన కార్యాలయంతో పాటుగా మ్యూజియం తదితర సందర్శనీయ ప్రాంతాలు కూడా మూతపడ్డాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Indian Students 
  • Study in USA 
  • Teugu NEws 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS