అమెరికాలో టైమ్ స్క్వేర్ పై ఎగరనున్న మువ్వన్నెల జెండా

Update: 2020-08-12 04:15 GMT
అమెరికా నేలపై భారత జాతీయ పతాకం ఎగరనుంది. స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15న అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో మన మువ్వన్నెల పతాకం రెపరెపలాడబోతోంది. ప్రతిష్ఠాత్మకమైన టైమ్స్్ స్క్వేర్‌లో మన దేశ జాతీయ పతాకం సగర్వంగా ఎగురవేయబోతోండటం చరిత్రలో ఇదే తొలిసారి. మొట్టమొదటిసారిగా, భారతీయ సంతతికి చెందిన ప్రముఖ సంఘాల సమూహం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) ఈ కార్యక్రమానికి పూనుకుంది

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 2020 ఆగస్టు 15 న ‘టైమ్స్ స్క్వేర్‌లో మొట్టమొదటిసారిగా జెండా ఎగురవేసి ‘చరిత్రను సృష్టిస్తాం’ అని ఎఫ్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో న్యూయార్క్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రణధీర్ జైస్వాల్ గౌరవ అతిథిగా పాల్గొంటారు.

ఆగస్టు 14న కూడా మువ్వన్నెలతో ఎంపైర్ స్టేట్ భవనాన్ని ప్రకాశించే వార్షిక సంప్రదాయం జరుగుతుంది. 1970లో ప్రారంభించిన భారతీయ సంఘాల సమాఖ్య ( FIA)కి 2020  గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానిక ిశ్రీకారం చుట్టింది. ఎఫ్ఐఏ ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాన్ హటన్ నడిబొడ్డున ఇండియా డే పరేడ్‌ను నిర్వహిస్తుంది మరియు అమెరికా రాజకీయ నాయకులు, చట్టసభ సభ్యులు, భారతదేశానికి చెందిన ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. ఇందులో వేలాది మంది పాల్గొంటుంటారు. ఈ సంవత్సరం కోవిడ్ వల్ల అది జరగడం లేదు. దాని స్థానంలో ఈ సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారని తెలుస్తోంది.  కొసమెరుపు ఏంటంటే.. ఇది అమెరికా ఎన్నికల సంవత్సరం కావడంతో అమెరికా పార్టీల నుంచి ఈ కార్యక్రమానికి  పూర్తి మద్దతు లభిస్తోంది.
Tags:    

Similar News