మహా పతనం దిశగా మండే మార్కెట్లు

Update: 2020-03-16 08:00 GMT
కరోనా ప్రభావం దేశంలో కంటే కూడా స్టాక్ మార్కెట్లో మరింత దారుణంగా మారింది. ఆదివారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వందను దాటితే.. గడిచిన కొద్ది రోజులుగా మార్కెట్లో సెన్సెక్స్ లు దారుణంగా పడిపోతున్నాయి. అంతో ఇంతో గత వారం క్లోజింగ్ కు ఫర్లేదనిపించిన సూచీలు.. ఈ రోజు (సోమవారం) ట్రేడింగ్ మొదలైన నాటి నుంచి మహా పతనం దిశగా పరుగులు తీస్తున్నాయి. అంతకంతకూ పడిపోతున్న సూచీల విలువలతో మదుపరులు సొమ్ము ఆవిరి అవుతోంది.

దీంతో.. లక్షల కోట్ల రూపాయిలు కళ్ల ముందే కరిగిపోతున్న పరిస్థితి. ట్రేడింగ్ మొదలైన కాసేపటికి దారుణంగా సెన్సెక్స్ పడిపోయింది. ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతానికి సెన్సెక్స్ 1753 పాయింట్లు కోల్పోతే.. నిఫ్టీ 535 పాయిట్లు దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.31కు పడిపోయింది. గత వారం చోటు చేసుకున్న భారీ నష్టం అంతో ఇంతో ఈ వారం రికవరీ అవుతుందన్న అంచనాలకు భిన్నంగా కరోనా భయంతో మార్కెట్ సెంటిమెంట్ భారీగా దెబ్బ తింది.

ఇదిలా ఉంటే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల లో భారీ కోత విధించటం తో అక్కడి మార్కెట్లు దారుణంగా నష్ట పోయాయి. ఈ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి మార్కెట్ల తిరోగమనం ఆగలేదు. బీఎస్ ఈ సెన్సెక్స్ 1805 పాయింట్లు కోల్పోగా.. నిప్టీ 502 పాయింట్లు నష్టపోయింది. ఈ రోజు నష్టపోయిన షేర్లలో రిలయన్స్ (రూ36.25).. ఎస్ బీఐ (రూ.15.45).. హెచ్ డీఎఫ్ సీ (రూ.157).. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ (రూ.51).. ఇండస్ ఇండ్ బ్యాంక్ (రూ.116.85).. ఆదానీ పోర్ట్స్ (రూ.38.50).. ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.36.65).. బజాన్ ఫైనాన్స్ (రూ.287.65) తదితరాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే లాభపడిన షేర్ల విషయానికి వస్తే.. యస్ బ్యాంక్ (రూ.37.50).. బజాజ్ ఆటో (రూ.16.90) తదితర షేర్లు ఉన్నాయి.
Tags:    

Similar News