గార్డియ‌న్ మాటః మోడీ హిందూ తాలిబాన్‌

Update: 2015-11-13 16:06 GMT
భారత ప్రధాని న‌రేంద్ర‌మోడీ బ్రిటన్ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా ఉన్నారు. మీటింగ్‌ లు… ఒప్పందాలు అంటూ… తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే అక్కడ పత్రికలు మాత్రం ఆయనకు మరో రకంగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భార‌తదేశంలో పెరుగుతున్న అసహనతపై వ్యాసాల మీద వ్యాసాలు రాయిస్తున్నాయి. బుద్ధుడు, గాంధీ పుట్టిన దేశం అంటూ ఆయన చేసిన ప్రసంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా…మోడీ పాలనలో హిందుత్వ తాలిబన్లు పెరుగుతున్నారంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ప్రధాని మోడీకి ఓ ప్ర‌ఖ్యాత ప‌త్రిక నుంచి ఊహించని షాక్‌ తగిలింది. ప్రధానిని ఓ హిందూ తాలిబన్‌ గా - ప్రస్తుతం భారత్‌ లో మోడీ నేతృత్వంలోని హిందూ తాలిబన్‌ ల‌ పాలన కొనసాగుతుందని గార్డియన్‌ పత్రిక ఒక ఆర్టికల్‌ ప్రచురించింది. బ్రిటన్‌ లో స్థిరపడిన భారత శిల్పి అనీశ్‌ కపూర్‌ మోడీని విమర్శిస్తూ గార్డియన్‌ కు ఈ ఆర్టికల్‌ రాశారు. భారత్‌ లో ప్రస్తుతం అసహనం పతాక స్థాయిలో పెరిగిపోయిందనీ ఈ ఆర్టికల్‌ లో ఆయన పేర్కొన్నారు. గ్రీన్ పీస్ స్వ‌చ్ఛంద సంస్థపై నిషేధం - తీస్తా సెత‌ల్వాద్‌ కు ఎదురైన ఇబ్బందులు - బీఫ్ గొడ‌వ - అవార్డులను వెనక్కి ఇచ్చేసిన రచయితలు - ఆర్టిస్టులు వంటి అంశాల‌న్నీ ఈ వ్యాసంలో ప్ర‌స్తావించారు. గాంధీ - బుద్ధుడు జన్మించిన భారత్‌ అత్యంత సహనశీల దేశమని మోడీ - బ్రిటన్‌ ప్రధాని కామెరూన్‌ సమక్షంలో అంతర్జాతీయ మీడియాకు చెప్పిన మరుసటి రోజే గార్డియన్‌ లో ఈ ఆర్టికల్‌ ప్రచురించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అనీశ్‌ కుమార్‌ 1970ల్లో భారత్‌ వదిలి ఇంగ్లాండుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. యూపీఏ హయాంలో ఆయనకు పద్మవిభూషణ్‌ అవార్డును బహుకరించారు. ఇదిలాఉండ‌గా...బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలపై విరుచుకుపడింది. ఎప్పటిలాగే మోడీ ఆకాశానికెత్తేసింది. మోడీని భారతీయులందరూ విష్ణువు అవతారంగా భావిస్తున్నారని పేర్కొంది. మొత్తంగా మోడీ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగే విధంగా అక్కడి వ్యాసాలు ఉండటం బీజేపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.
Tags:    

Similar News