అఫిషియల్: దేశంలో అవినీతి తగ్గింది
ప్రపంచంలో ఏయే దేశంలో ఎంత అవినీతి ఉందో తెలుపుతూ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఏటా ప్రచురించే జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. తద్వారా చైనా కన్నా తక్కువ అవినీతి ఉన్న దేశంగా భారత్ అవతరించింది. తక్కువ అవినీతి దేశాల జాబితాలో 18 ఏళ్ల తరువాత భారత్ చైనా కన్నా తక్కువ స్థానంలో నిలవడం గమనార్హం. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ నిర్వహించిన వార్షిక సర్వేలో భారత్ పది స్థానాలు ఎగబాకి 85వ స్థానంలో నిలిచింది. చైనా 20 స్థానాలు దిగజారి 100వ స్థానంలో నిలిచింది. మొత్తం 175 దేశాలలో భారత్ 85 స్థానంలో నిలవగా, చైనా వందో స్థానంలో నిలిచింది.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఏటా ‘గ్లోబల్ కరప్షన్ బారోమీటర్’ పేరిట సర్వే నిర్వహించి, నివేదికను విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన ఈ నివేదికలో కమ్యూనిస్టుల పరిపాలన ఉన్న చైనా కంటే భారత్ లో అవినీతి తక్కువగా ఉండటం అభినందించదగ్గ విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందిస్తూ తాము అధికారంలోకి రాకముందు భారతదేశంలో అవినీతి భారీ స్థాయిలో ఉండేదన్నారు. ఇపుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగులుతున్నామని చైనాతో పోలిస్తే అవినీతి తగ్గిందని అంతర్జాతీయ సంస్థలు రేటింగ్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.