ఇండియాకు గే పెళ్లిళ్ల పేరయ్య వచ్చేశాడు
పెళ్లిళ్ల పేరయ్యలు కామన్. కాలంతో వచ్చిన మార్పులతో మ్యారేజ్ బ్యూరోలు వచ్చేశాయి. ఆనంతరం వెబ్ సైట్లు వచ్చేశాయి. ఎన్ని వచ్చినా.. ఆడకు మగ.. మగకు ఆడవాళ్లను వెతికే బ్యూరోలే కానీ.. ఆడోళ్లకు ఆడోళ్లను.. మగాళ్లకు మగాళ్లను కట్టబెట్టేందుకు.. వారికి పెళ్లిళ్లు చేసేందుకు వీలుగా మ్యారేజ్ బ్యూరోలు ఇప్పటివరకూ లేవు.
ఆ కొరత తీర్చేందుకు వీలుగా తాజాగా హోమో సెక్స్ వల్స్ కోసం మ్యారేజ్ బ్యూరో ఒకటి దేశంలో స్టార్ట్ అయ్యింది. ఈ మ్యారేజ్ బ్యూరోను అమెరికాలో సెటిల్ అయిన ప్రవాసభారతీయుడు బెనహర్ శాంసన్ స్టార్ట్ చేశారు. స్వలింగ సంపర్కుల కోసం భారత్ లో ఏర్పాటు అయిన తొలి మ్యారేజ్ బ్యూరోగా ఆయన చెబుతున్నారు.
తమ పార్టనర్స్ ను వెతుక్కునేందుకు స్వలింగ సంపర్కులు పెద్ద ఎత్తున ఇండియాకు వస్తున్నారని.. అలాంటి వారి కోసమే తామీ బ్యూరో నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. దేశంలో 25 లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉన్నట్లు ఒక అంచనా. ఈ నేపథ్యంలో గే మ్యారేజ్ కోసం పెద్ద ఎత్తున ఎంక్వయిరీలు వస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఇప్పటికే తాము 250 ఎంక్వయిరీలు వచ్చాయని.. వాటిని పరిశీలిస్తున్నట్లు చెబుతున్న ఆయన.. గే పెళ్లిళ్లకు న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే.. ఈ సేవలు పొందాలంటే 5వేల అమెరికన్ డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. పెళ్లిని కుదర్చటంలో ఫెయిల్ అయితే మాత్రం 5వేల డాలర్లను తిరిగి ఇచ్చేస్తారట. చూస్తుంటే.. మిగిలిన మ్యారేజ్ బ్యూరోల కంటే గే మ్యారేజ్ బ్యూరో పెట్టటం తప్పుడు నిర్ణయం ఎంతమాత్రం కాదనే చెప్పాలి.