ఎనిమిదేళ్ల తరువాత చర్చలు 'అణు'కూలించాయి

Update: 2015-11-30 07:53 GMT
భారతదేశానికి యురేనియం సరఫరా చేసే విషయంలో ఎనిమిదేళ్లుగా నాన్చుతున్న ఆస్ర్టేలియా ప్రభుత్వం ఎట్టకేలకు ఓకే అంది. భారత్ కు యురేనియం సరఫరా చేయడానికి అంగీకరించింది. దీంతో ఇన్నాళ్లుగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలికినట్లయింది. తాజాగా కుదుర్చుకున్న 'ఇండియా - ఆస్ర్టేలియా అణు సహకారం ఒప్పందం' ప్రకారం భారత్ తో యురేనియం వ్యాపారం చేయడానికి ఆస్ర్టేలియా సంస్థలకు వీలు కలుగుతుంది.

అణు నిరాయుధీకరణ ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోవడాన్ని కారణంగా చూపుతూ ఆస్ర్టేలియా ఇంతకాలం ఇండియాకు యురేనియం సరఫరా చేయడానికి ముందుకురాలేదు. అయితే... ఎనిమిదేళ్లలో ఆ దేశంలో మారిన అన్ని ప్రభుత్వాలతోనూ నిత్యం సంప్రదింపులు జరిపిన ఫలితమో ఏమో కానీ ప్రస్తుత ఆస్ర్టేలియా ప్రభుత్వం ఇండియాకు యురేనియం ఇవ్వడానికి రెడీ అని చెప్పింది. అంతేకాదు... ఆ దేశ విదేశాంగ మంత్రి జూలి బిషప్ దీనికి సంబంధించి ఒప్పందం కూడా చేసుకున్నారు.

భారత్ లో పెరుగుతున్న విద్యుత్ అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తికి తాజా ఒప్పందం చాలా ప్రయోజనం కలిగిస్తుంది. భారత్ కు యురేనియం సరఫరా చేయడానికి గతంలోనూ ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నప్పటికీ అణు నిరాయుధాకరణ ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించడం, దాంతో ఇండియాకు యురేనియం సరఫరా చేయొద్దని అమెరికా వంటి దేశాలు ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచడం.. ఆస్ర్టేలియాలో ప్రభుత్వాలు మారడం లాంటి అంశాలు ఈ ఆలస్యానికి కారణమయ్యాయి.
Tags:    

Similar News