గంజాయివనంలో తులసిమొక్క ఇండియా

Update: 2016-01-26 07:59 GMT
 ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇండియాను గంజాయి వనంలో తులసి మొక్క అని తేల్చింది. ఇరుగుపొరుగున చెడ్డ దేశాలు ఉన్నప్పటికీ వాటి మధ్య ఉత్తమ నివాసంగా ఇండియా విలసిల్లుతోందని తేల్చింది. మోడీ ప్రధాని అయిన 2014 మే తరువాత సెన్సెక్స్ పడిపోవడంపైనా మోర్గాన్ స్టాన్టీ స్పందించింది... అంతర్జాతీయ కారణాలే తప్ప మోడీ పాలన అందుకు కారణం కాదని పేర్కొంది. చైనాలో మాంద్యం - క్రూడాయిల్ ధరలు పతనం వంటి కారణాలతో సెన్సెక్స్ పతనమైనందని వెల్లడించింది.

అయితే... అదే సమయంలో మోడీకి పలు సలహాలు ఇచ్చింది. ప్రధానంగా నాలుగు విభాగాల్లో శ్రద్ధ పెట్టాలని పేర్కొంది. గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టాలని... ద్రవ్యలోటు తగ్గించే చర్యలు చేపట్టాలని... పెట్టుబడులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని.. ఎగుమతులు పెంచాలని సూచించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఆశాజనకంగా ఉన్నందున పెట్టుబడులకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోరాదని పేర్కొంది. మొత్తానికి మోడీ తప్పేంలేదని మోర్గాన్ స్టాన్లీ తేల్చింది.
Tags:    

Similar News