346 డాలర్ల వాచ్ కొంటే.. ఇప్పుడు ఎంతయిందో తెలుసా?

Update: 2020-01-30 03:30 GMT
షేర్ మార్కెట్లో ఒకప్పుడు కిందట వేలల్లో పెట్టుబడి పెట్టి ఇప్పుడు లక్షలు, కోట్లు అయిపోవడం గురించి కథనాలు చదువుతుంటాం. భూముల విలువలు కూడా ఇలాగే పెరుగుతుంటాయి. ఐతే ఏదైనా వస్తువు కొంటే కాల క్రమంలో దాని విలువ తగ్గుతుంది తప్ప పెరగడం జరగదు. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి నాలుగున్నర దశాబ్దాల కిందట ఓ వాచ్ కొంటే దాని ధర ఇప్పుడు లక్షల రెట్లు పెరిగిపోవడం విశేషం. ఆ వాచ్‌‌కు వేలంలో అనూహ్యమైన ధర పలికింది. యుఎస్ మిలిటరీలో పని చేసిన ఆ వ్యక్తి 10 శాతం డిస్కౌంట్ కింద 1974లో 345.97 డాలర్లకు రోలెక్స్ వాచ్ కొన్నాడు. అప్పటికి అది ఖరీదైన వాచ్. కొన్నేళ్లు వాడాక ఆ వ్యక్తి దాన్ని ఒక సేఫ్టీ బాక్సులో పెట్టి దాచాడు. ఇన్నేళ్ల తర్వాత పాత వస్తువల వేలంలో దాన్ని పెట్టగా.. అక్కడ దానికి పలికిన ధర విని హతాశుడయ్యాడా వ్యక్తి.

ఆ వాచ్‌‌‌కు వేలం లో పలికే ధర 4 లక్షల డాలర్లని (అక్షరాలా 2.848 కోట్లు) అని ఆక్షనర్ చెప్పడం తో దాని యజమాని హతాశుడై కింద పడిపోయాడు. ఆ తర్వాత లేచి తేరుకుని ఇది నిజమా కలా అన్నట్లుగా చూశాడు. సేఫ్టీ బాక్సులో పెట్టడం వల్ల ఆ వాచ్‌కు చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. వాచ్ చెక్కు చెదరక పోవడం వల్ల దాని విలువ ఇంకా పెరుగుతుందని.. అసలు ధర ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు వేచి చూడాల్సి ఉంటుందని ఆక్షనర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా వాచ్ యజమాని చాలా ఎగ్జైట్ అవుతూ.. వాచ్ కొన్నప్పటి తన అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు. 10 శాతం డిస్కౌంటు తో ఆ వాచ్ కొన్న తాలూకు బిల్లును కూడా అతను దాచి పెట్టి వేలం సందర్భంగా అందరితో పంచుకోవడం విశేషం. మరి ఈ వాచ్‌కు చివర గా ఎంత ధర పలుకుతుందో చూడాలి.


Tags:    

Similar News