పోలీసులపై ఆ 'ఐఏఎస్' సంచలన ఆరోపణలు

Update: 2017-03-22 14:42 GMT
పెను సంచలనంగా మారిన డ్రైవర్ నాగరాజు హత్య కేసు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దృశ్యం సినిమాను తలపించేలా కొడుకు చేసిన హత్యను ఐఏఎస్ తండ్రి కవర్ చేసే ప్రయత్నం చేయటం..ఆ క్రమంలో  పోలీసులకు దొరికిపోవటం పెను సంచలనానికి దారి తీసింది. ఈ హత్య వెనకున్న అసలు కారణాల లెక్క తీసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఈ హత్యలో కొడుకు సుక్రును తప్పించేందుకు అతడి తండ్రి ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్దారించి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తనకు డ్రైవర్ నాగరాజు హత్యకు ఎలాంటి సంబంధం లేదని.. తాను డబ్బులు ఇవ్వకపోవటంతో తనపై అక్రమ కేసులు పెట్టినట్లుగా ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు ఆరోపించటం సంచలనంగా మారింది.

తనను కేసు నుంచి తప్పించేందుకు రూ2కోట్ల లంచం డిమాండ్ చేశారని.. అందుకు తాను ఒప్పుకోకపోవటంతో తనను కేసులో ఇరికించినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. కేసును విచారిస్తోన్న ఉన్నతాధికారులతో పీపటు.. నగర పోలీస్ కమిషనర్ సీపీ మహేంద్ర రెడ్డిని కూడా విచారిచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. విచారణ కోసం తీసుకెళ్లిన పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేసినట్లుగా చెబుతున్న ఐఏఎస్ అధికారి మాటలు ఇప్పుడు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉండటం గమనార్హం. తాను కానీ తప్పు చేసినట్లుగా నిరూపిస్తే.. తాను ఉరిశిక్షకు అయినా సిద్ధమని చెబుతున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News