కూటమి పుట్టలో ఎంతో మంది...అయినా నో యాక్షన్ !
వైసీపీకి రాజకీయ ఆయుధాలు దొరుకుతున్నాయి. కూటమి నేతలు వరసగా ఇబ్బందులో పడుతూంటే వైసీపీ అంతే ధీటుగా వాటిని అందిపుచ్చుకుంటోంది.;
వైసీపీకి రాజకీయ ఆయుధాలు దొరుకుతున్నాయి. కూటమి నేతలు వరసగా ఇబ్బందులో పడుతూంటే వైసీపీ అంతే ధీటుగా వాటిని అందిపుచ్చుకుంటోంది. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఏదో ఒక విషయం మీద కూటమిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో వైసీపీ బిజీగా ఉంది అని అంటున్నారు. ఏలూరు ఎంపీ టీడీపీకి చెందిన యువ నాయకుడు పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో వైసీపీ దాని మీద గట్టిగానే పట్టు బిగుస్తోంది. పుట్టా మొదలుకుని ఎందరో ఎన్నెన్నో అంటూ ఏకంగా వైసీపీ అధినేత జగన్ లిస్ట్ చెబుతూ కూటమికి షాకిస్తున్నారు.
తొలి టీడీపీ ఎంపీగా రికార్డు :
కూటమి ప్రభుత్వం లో ఎంపీగా ఉంటూ దేశంలోనే ఒక సరికొత్త రికార్డుని పుట్టా మహేష్ యాదవ్ నెలకొల్పారని జగన్ విమర్శించారు. ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఏ ఎంపీ కూడా ఈ విధంగా డ్రగ్స్ కేసులో నేరుగా పట్టుబడలేదని ఆయన గుర్తు చేశారు. ఇంత జరిగినా టీడీపీ పెద్దలు ఏమి చర్యలు తీసుకుంటున్నారు అంటే నో యాక్షన్ అని జగన్ ఎద్దేవా చేశారు.
వీరి సంగతేంటి :
ఏపీలో కూటమి ఎమ్మెల్యేలు అరవై శ్రీధర్ ఆదిమూలం సురేష్ సహా ఎంతో మంది మీద ఆరోపణలు వచ్చినా కూడా కూటమి పెద్దలు కనీసమాత్రంగా అయినా చర్యలు తీసుకోలేదని జగన్ ఆక్షేపించారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ మరో గుంటూర్ ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ల మీద ఆరోపణలు వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. బాబు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వల్లనే కూటమి ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఆ వీడియోలు అన్నీ వైరల్ అవుతున్నాయని కంటికి కంబడుతున్నా బాబు ఏమీ యాక్షన్ తీసుకోలేదని జగన్ ఫైర్ అయ్యారు.
వీటికి పరాకాష్ట :
ఆఖరికి ఒక మంత్రి పీఏ మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడినా బాబు ఏమీ చేయలేకపోయారు అని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. వీటికి పరాకాష్ట ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీద ఆరోపణలు వచ్చినా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుని పట్టుబడినా నో యాక్షన్ అన్నట్లుగా కూటమి పెద్దల తీరు ఉందని జగన్ విమర్శించారు. ఇక నారా లోకేష్ మీద జగన్ ఆరోపణలు చేశారు. స్విమ్మింగ్ పూ లో డ్యాన్సులు వేసినా యాక్షన్ లేదని అమ్మాయిలు కనిపిస్తే ఏదో ఒకటి చేయాలన్న బాలయ్య మీద యాక్షన్ లేదని ఇదీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరు అని జగన్ ఘాటుగా విమర్శించారు.