మరోసారి బాబు పవన్- ఉత్కంఠ రేపుతున్న భేటి
కేవలం పదిహేను రోజుల తేడాలో మరోసారి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు.;
కేవలం పదిహేను రోజుల తేడాలో మరోసారి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. చంద్రబాబుని ఆయన నివాసంలో బుధవారం పవన్ కలవబోతున్నారు అని అంటున్నారు. ఈ భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వస్తాయి అన్నది అంతటా చర్చ సాగుతోంది. ఈ నెల 3న చంద్రబాబు పవన్ ల భేటీ ఉండవల్లి నివాసంలో జరిగింది. మళ్ళీ ఇంత త్వరగా భేటీ జరగడం పట్ల అయితే ఆసక్తి నెలకొంది.
తాజా రాజకీయ పరిణామాలు :
ఇదిలా ఉంటే ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వస్తాయని అంటున్నారు. అంతే కాదు నామినేటెడ్ పదవులతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే ఆస్కారం ఉందని భావిస్తున్నారు. ఇక మంత్రి వర్గ విస్తరణ తొందరలో ఉంటుందని భావిస్తున్న క్రమంలో దాని మీదనే సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న క్రమంలో ఆ అంశాలు కూడా చర్చకు వస్తాయని అంటున్నారు.
పుట్టా ఇష్యూ సైతం :
ఇక ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ పాయింట్ గా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఇష్యూ ఉందని అంటున్నారు. దాంతో దీని మీద ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం షోకాజ్ నోటీసుని ఆయనకు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. అయితే ఈ విషయం మీద వైసీపీ అయితే రాజకీయ రచ్చ చేస్తోంది. దాంతో దీని మీద కూడా ఈ ఇద్దరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇష్యూ మీద అయితే వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. దాంతో ఈ విషయం మీద కూడా చర్చిస్తారా అన్నది కూడా ప్రచారంలో ఉంది.
స్థానిక సంస్థల గురించి :
ఇక ఏపీలో చూస్తే మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు పదవీ కాలం ముగిసింది. పంచాయతీలకు తొందరలో ముగియబోతోంది. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చర్చిస్తారా అన్నది కూడా అనుకుంటున్నారు. అలాగే స్థానిక ఎన్నికలను సాధ్యమైనత త్వరగా నిర్వహించాలని కూటమి పార్టీలకు క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తోంది. దాంతో ఈ ఇష్యూ కూడా కీలకంగా మారుతోంది. ఇక చూస్తే రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సుకు, అలాగే తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశానికి పవన్ హాజరు కాలేదు. దాంతో ఈ ఇద్దరు నేతలు కలిస్తే అనేక అంశాల గురించి చర్చకు రావచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే సరిగ్గా ఉగాదికి ఒక రోజు ముందు కూటమి పెద్దలు ఇద్దరూ భేటీ కాబోతున్నారు అంటే మ్యాటర్ ఏంటో అన్న ఆసక్తి అయితే అంతటా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏ ఇష్యూస్ ని చర్చిస్తారో .