తెలంగాణలో తీవ్ర కలకలం.. ఒకే ఆస్పత్రిలో 32మందికి వైరస్

Update: 2020-06-15 16:30 GMT
తెలంగాణలో కరోనా మహమ్మారి జడలు విప్పుతూనే ఉంది. హైదరాబాద్ లో అయితే విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు, జర్నలిస్టులకు కూడా పాకింది. ఇన్నాళ్లు సామాన్యులు, పోలీసులు, వైద్యులు, అధికారులకు సోకిన వైరస్ ఇప్పుడు ప్రజాప్రతినిధుల్లో కూడా వెలుగుచూస్తోంది.

హైదరాబాద్ లో అయితే పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపిస్తోంది. రోజుకురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో సామూహిక వ్యాప్తి తెలంగాణలో కలకలం రేపుతోంది.

హైదరాబాద్ లోని పేట్లబురుజు ఆస్పత్రిలో తాజాగా కరోనా కలకలం చెలరేగింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 32మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు డీఎంహెచ్.వో ప్రకటించడం సంచలనమైంది. ఈ వార్త తీవ్ర ఆందోళనకు కారణమైంది.

కరోనా సోకిన వారిలో 14మంది వైద్యులు ఉండగా.. 18మంది వైద్యసిబ్బంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఆస్పత్రిలో అత్యధిక కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి కావడం కలకలం రేపింది.
Tags:    

Similar News