• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఓఆర్ఆర్ మీద జెట్ స్పీడ్...

ఓఆర్ఆర్ మీద జెట్ స్పీడ్ తో దూసుకెళ్లే అలవాటుందా.. మీకోసమే?

By - Tupaki Desk
Update: 2021-12-30 12:30 GMT
హైదరాబాద్ మహానగరంలోని వారు మాత్రమే కాదు.. హైదరాబాద్ కు ఏదో ఒక సందర్భంలో రావటం.. ఓఆర్ఆర్ (అవుటర్ రింగు రోడ్డు) మీదుగా ప్రయాణం చేసే వారంతా ఈ అప్డేట్ ను అస్సలు మిస్ కావొద్దు. ఆ.. ఏముందిలే అని చదివే విషయంలో లైట్ తీసుకున్నా.. దానికి మూల్యం వేలాది రూపాయిల్లో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకిలా? అంటే.. ఇప్పటివరకు అనుసరిస్తున్న రూల్ ను ఇప్పుడు మార్చేస్తున్నారు. ఓఆర్ఆర్ మీద గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో మాత్రం ప్రయాణం చేయాలి.

ఇందుకు భిన్నంగా చాలా మంది 110 నుంచి 140 వరకు స్పీడ్ తో దూసుకెళ్లే వాళ్లు బోలెడంత మంది. మరికొన్ని హైబ్రిడ్ కార్లతో అయితే.. ఆ వేగం మరింత పెరుగుతుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలా జెట్ స్పీడ్ తోదూసుకెళ్లే వాళ్లంతా.. తమ వాహనాల్ని సీసీ కెమేరాలు ఉండే ప్రాంతాల్లో నిర్ణీత వేగంలో వెళుతూ.. మిగిలినచోట్ల మాత్రం వాయు వేగంతో ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటివారికి చెక్ చెప్పేందుకు కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

ఇందుకోసం తాజాగా రింగు రోడ్డు ఎక్కిన వెంటనే ఎంట్రీ చెక్ పోస్టు దగ్గర నమోదైన టైంకు.. ఎగ్జిట్ చెక్ పోస్టు దగ్గర టైంను చెక్ చేస్తారు. ఈ రెండింటి మధ్య దూరం.. అందుకు పట్టిన ప్రయాణ సమయాన్ని లెక్క కట్టి.. నిబంధనలకు తగ్గట్లుగా వాహనాన్ని నడిపారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేస్తారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా. .వెంటనే వారికి భారీ ఎత్తున ఫైన్ వేస్తూ తాఖీదు పంపుతారు.

ఎందుకిలా? అంటే.. అవుటర్ రింగు రోడ్డు మీద రోడ్డు ప్రమాదాన్ని తగ్గించటం కోసం.. వాహనదారులు నిబంధనల్ని పక్కాగా పాటించటం కోసం ఈ కొత్తవిధానాన్ని జనవరి మొదటి వారం నుంచి అమల్లోకి  తెచ్చేలా ప్లాన్ చేశారు. అవుటర్ మీద జరిగే ప్రమాదాల్లో 30-40 శాతం రాత్రి పగతి వేళలో 60-70 శాతం జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అత్యధికం మితిమీరిన వేగం.. ఆ సందర్భంగా వాహనాన్ని కంట్రోల్ చేసే విషయంలో విఫలం కావటంతో ప్రమాదాలు జరిగి.. ప్రాణాలు కోల్పోతున్నారు.

అందుకే.. వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. అంటే.. అవుటర్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఒళ్లు దగ్గర పెట్టుకొని.. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రయాణం చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. జేబుకు చిల్లు పడటం ఖాయం.
Tags:    
  • Hyderabad Outer Ring Road 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

పాలు తాగవు...పగబట్టవు !

2026-11-13 00:30 GMT

అమెరికా ఆహారపు అలవాట్లలో మార్పులు.. కొత్త ఫుడ్ పిరమిడ్‌లో ఏయే ఆహారాలకు చోటు?

2026-11-12 23:30 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS