• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముచ్చటగా మూడో ఎఫైర్...

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

| ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్‌పై మరో వివాహేతర సంబంధం ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఇద్దరు మహిళలతో సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, మరో మాజీ ఉద్యోగినితోనూ సన్నిహితంగా ఉన్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో ఆయన సంపద తగ్గి ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానానికి పడిపోయినట్లు కథనాలు వెల్లడించాయి.

By - A.N.Kumar
Update: 2026-11-13 04:11 GMT

ప్రపంచ టెక్నాలజీ రంగంలో తిరుగులేని ఆధిపత్యంతో చిప్ ఇండస్ట్రీని శాసించిన ఎన్విడియో మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ చిప్ ల తయారీతోపాటు.. అందులోని తోటి ఉద్యోగులు, పరిచయమైన వారందరితోనూ చిలక్కొట్టుడు యవ్వరాలు బాగానే చేసినట్టున్నాడు. ఆయన బాగోతాలు రోజుకొకటి బయటపడుతూ పరువు తీస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న హువాంగ్ పై మరో సంచలన ఆరోపణ వెలుగుచూసింది. ఎన్విడియాలో పనిచేసిన మరో ఉద్యోగినితోనూ హువాంగ్ సన్నిహిత సంబంధం కొనసాగించారంటూ రాయిటర్స్ కథనం బాంబుపేల్చింది. దీంతో మనోడు పెద్ద రసికుడే అంటూ ఆయన చుట్టూ ఉన్న మరిన్ని సీక్రెట్స్ తవ్వి తీసే పనులు మీడియా, ఉత్సాహవంతులు పనిచేస్తున్నారు.

ఎన్విడియా మాజీ బాస్ జెన్సన్ హువాంగ్ లోపల చిప్‌లను డిజైన్ చేయడమే కాదు.. ఆఫీసులో రొమాంటిక్ నెట్‌వర్క్ కూడా గట్టిగానే బిల్డ్ చేసినట్టున్నారు. మొన్నటి వరకు టెక్ ప్రపంచంలో ఈయన పేరు చెబితే కోట్ల రూపాయల షేర్ల విలువ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం "ఏంటయ్యా హువాంగ్ ఈ చిలక్కొట్టుడు యవ్వారాలు" అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆయన వ్యక్తిగత జీవితంలో దాచిన సీక్రెట్ ఫైల్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఈ టెక్ దిగ్గజం పరువును గంగలో కలుపుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న హువాంగ్‌పై తాజాగా మరో బాంబు పేలింది. ఎన్విడియాలో పనిచేసిన మరో మాజీ ఉద్యోగినితోనూ మనోడు సన్నిహిత సంబంధం నడిపించాడంటూ రాయిటర్స్ ఒక సంచలన కథనాన్ని వదిలింది. దీంతో మనోడు మామూలోడు కాదు.. పెద్ద రసికరాజే అంటూ ఆయన చుట్టూ ఉన్న మరిన్ని రహస్యాలను తవ్వి తీసే పనిలో మీడియా.. గాసిప్ రాయుళ్లు బిజీ అయిపోయారు.

గత కొద్దిరోజులుగా హువాంగ్ లవ్ స్టోరీలు సీరియల్ ఎపిసోడ్లలాగా విడుదలవుతున్నాయి. డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్ ఎగ్జిక్యూటివ్ పైగా చైనా గూఢచారి అనే అనుమానాలు ఎదుర్కొంటున్న ఆలిస్ హువాంగ్‌తో ఈయనకు ఎఫైర్ ఉందనే వార్త పెను దుమారమే రేపింది. ఆ వేడి చల్లారకముందే, ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తోనూ హువాంగ్ 'హెల్దీ' రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశారని న్యూయార్క్ టైమ్స్ కుండబద్దలు కొట్టింది. ఈ దెబ్బకు మరుసటి రోజే ఆయన సీఈవో కుర్చీకి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు రాయిటర్స్ మరో అడుగు ముందుకేసి పేరు బయటపెట్టని మరో ఎన్విడియా ఉద్యోగినితోనూ హువాంగ్ యవ్వారం నడిపాడని బాంబు పేల్చింది.

సాధారణంగా ఆఫీసుల్లో కింది స్థాయి ఉద్యోగులతో ఉన్నతాధికారులు సంబంధాలు పెట్టుకుంటే అది అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది. ఎన్విడియా ప్రవర్తనా నియమావళి కూడా ఇదే చెబుతోంది. కానీ రూల్స్ రాసే స్థానంలో ఉన్న బాస్ నేరుగా రంగంలోకి దిగితే ఇక ఆపేదెవరు?

1980 నుంచి హువాంగ్‌తో కలిసి కాపురం చేస్తున్న భార్య లోరీ హువాంగ్ ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు. కానీ ఈ ముచ్చటగా మూడో ఎఫైర్ తర్వాత ఆవిడ సహనం నశించి విడాకుల బాట పడితే మాత్రం హువాంగ్‌కు చుక్కలు కనిపించడం ఖాయం. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం పెళ్లయ్యాక సంపాదించిన ఆస్తిలో భార్యకు సగం వాటా దక్కాలి. అంటే ఎన్విడియాలో హువాంగ్‌కు ఉన్న 3.5 శాతం వాటాలో సగం లోరీ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఈ తుఫాను హువాంగ్ బ్యాంక్ బ్యాలెన్స్‌ను కూడా గట్టిగానే కుదిపేసింది. గురువారం మార్కెట్లు తెరవగానే ఆయన సంపద ఒక్కసారిగా 10 శాతం ఆవిరైపోయింది. ప్రస్తుతం 143 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుల టాప్-10 జాబితా నుంచి జారిపోయి 13వ స్థానానికి పడిపోయారు.

ప్రస్తుతానికి ఆలిస్ హువాంగ్ విషయాన్ని మాత్రమే అంగీకరించిన జెన్సన్ మిగతా ఉద్యోగినుల వ్యవహారాలపై పెదవి విప్పడం లేదు. ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు చెప్పిన ఈ దిగ్గజం తన 'నేచురల్ ఎమోషన్స్'ను కంట్రోల్ చేసుకోలేక ఇలా అడ్డంగా బుక్కవ్వడం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముందు ముందు ఈ కథలో ఇంకెన్ని 'చిప్స్' బయటపడతాయో వేచి చూడాలి.

Tags:    
  • jensenhuang 
  • nvidia 
  • technews 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS