హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి పాజిటివ్ ..షాప్స్ క్లోజ్

Update: 2020-06-16 13:30 GMT
హైదరాబాద్‌ కోఠిలో ఉండే గోకుల్ చాట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భాగ్యనగర వాసులకు గోకుల్ చాట్ చాలా బాగా తెలిసిన ప్రాంతం. ఇక్కడ చాట్ చాలా ఫేమస్. అందుకే సాయంత్రమైతే రద్దీ మామూలుగా ఉండదు. ఇక్కడ లభించే చాట్, దైపూరి, సమోసా, కచోరి ఇలా చాలా స్నాక్స్‌ కు ప్రత్యేకత ఉంది. చాలా రుచిగా కూడా ఉంటాయని భోజన ప్రియులంతా భావిస్తారు. అందుకే సాయంత్రం అయితే అంతా ఇక్కడ వాలిపోతారు.

అయితే లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్‌ లో హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడంతో గోకుల్ చాట్ కూడా ఓపెన్ చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ సీజ్ చేశారు. కారణం కరోనా వైరస్ తాజాగా ఆ షాపు నిర్వాహకుడుకు వైరస్ పాజిటివ్ గా తేలింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. గోకుల్ చాట్ ‌ను విజయ్ వైరాగ్యి అనే 70 ఏళ్ల వ్యక్తి నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు.

అందులో పాజిటివ్ అని తేలిందని , దీంతో గోకుల్ చాట్ దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు అని , అతనితో పనిచేసే మరో 20 మంది సిబ్బందిని కూడా క్వారంటైన్‌లో ఉంచారు. గత రెండు రోజులుగా షాపునకు వచ్చే వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే , తెలంగాణలో సోమవారం ఒక్క రోజే కొత్తగా 219 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మొత్తం బాధితుల సంఖ్య 5193కి పెరిగిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News