నిర్మ‌లా సీతారామ‌న్‌పై భర్త పరకాల సెటైర్...వైరల్

Update: 2020-09-04 07:50 GMT
వేర్వేరు పార్టీల్లోని రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సర్వ సాధారణం. అధికార పార్టీ చేసిన ప్రతి పనినీ పనిగట్టుకొని మరీ విమర్శించడం ప్రతిపక్ష పార్టీలకు పరిపాటి. సందు దొరికితే చాలు....అధికార పార్టీ నేతలపై సెటైర్లు వేసేందుకు విపక్ష నేతలు రంధ్రాన్వేషణ చేస్తుంటారు. అటువంటి సెటైర్లు వేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఇపుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మన దేశ జీడీపీ మైనస్ 23కు పడిపోవడం `యాక్ట్ ఆఫ్ గాడ్` అని నిర్మలా సీతారామన్ చెప్పడంపై ప్రతిపక్షాలతోపాటు నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. ఈ టైప్ పొలిటికల్ కామెంట్లు, సెటైర్లను నిర్మలా సీతారామన్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, నిర్మలా సీతారామన్ పై ఆమె భర్త, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ కూడా వ్యంగ్యంగా స్పందించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

భారత్ జీడీపీ మైన‌స్ 23 శాతంగా న‌మోదు కావ‌డంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా విపత్తు యాక్ట్ ఆఫ్ గాడ్ అని, దాని వల్లే జీడీపీ పతనమైందని నిర్మలా సీతారామ‌న్ చేసిన ప్రకటనపై సెటైర్లు పేలుతున్నాయి. దీనిపై, నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ కూడా సెటైరికల్ గా ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. సూక్ష్మ‌, ఆర్థిక స‌వాళ్ల‌పై కేంద్రం స్పందించకపోడమే అస‌లైన యాక్ట్ ఆఫ్ గాడ్ అని, కరోనా కంటే ముందే దేశ జీడీపీ పతనమయ్యే దిశగా అడుగులు వేస్తోందని ట్వీట్ చేశారు. జీడీపీ పతనాన్ని గత అక్టోబ‌ర్‌లోనే ఊహించానని, కానీ ఆనాడు ప్ర‌భుత్వం దానిని అంగీకరించలేదని పరకాల అన్నారు. ఇపుడు, జీడీపీ వృద్ధి రేటు పాతాళానికి ప‌డిపోవ‌డంతో అస‌లు వాస్త‌వం తెలిసొచ్చిందని, ఇకనైనా ఆ దేవుడి కోసం ఏదో ఒక‌టి చేయండి అంటూ పరకాల చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పరకాల చెప్పినట్లు ఇకనైనా దేశ జీడీపీ వృద్ధిపై కేంద్రం ఫోకస్ చేయాలని, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ దేవుడిపై నెట్టడం వంటి పనులు మానాలని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మామూలుగా అయితే, విపక్ష నేతల విమర్శలకు నిర్మలా సీతారామన్ ఘాటుగా బదులిచ్చి ఉండేవారని, కానీ, ఇపుడు తన భర్త స్వయంగా సెటైర్ వేయడంతో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని నెటిజన్లు అభిప్రాయడుతున్నారు. నిర్మ‌లా సీతారామ‌న్ ను పరకాల ట్వీట్  ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు. ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ట్వీట్ ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంలా మారిందని, ఆ ట్వీట్ పై నిర్మలా సీతారామన్ స్పందిస్తారా...లేక సైలెంట్ గా ఉంటారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 
Tags:    

Similar News