• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా సంక్షోభంలో కరెప్షన్...

కరోనా సంక్షోభంలో కరెప్షన్ .. 40 వేల ఫిర్యాదులు , నివేదిక కోరిన ప్రధాని మోడీ

By - Tupaki Desk
Update: 2020-12-07 12:16 GMT
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలని అతలాకుతలం చేస్తుంది. ఇంకా దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, కరోనా వైరస్ కాలంలో కరోనా సంక్షోభాన్ని కూడా కరెప్షన్ కోసం అధికారులు వాడుకున్న తీరు దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల దాకా ఫిర్యాదులు అందాయంటే ఎంతగా అవినీతి జరిగిందో మరి. కరోనా పేషెంట్ లకు అందించే మౌలిక వసతులు, వైద్యం, వెంటిలేటర్ సదుపాయాలతో పాటుగా, ఇతర దేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం, లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలపై కొనసాగిన వేధింపులు మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు లక్షల్లోనే ఉన్నాయి.

అందులో అవినీతి ఫిర్యాదులు 40000 ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ కు సంబంధించిన అవినీతికి సంబంధించి కేంద్రానికి 40,000 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో, కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో, కరోనాకు సంబంధించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ ‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ కు ఇప్పటివరకు 167,000 ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ వెబ్ ‌సైట్ ‌లో ఈ ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి.

నవంబర్ 25 న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ సమావేశంలో ఈ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. ప్రగతి వివిధ మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్న 2015 లో ప్రారంభించిన ప్రభుత్వ పరిపాలనా సంస్కరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో కరోనా కరప్షన్ గురించి గురించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో మరియు అవి ఏ మేరకు పరిష్కారమయ్యాయో తనకు నివేదిక కావాలని , ప్రధాని నరేంద్ర మోడీ అడిగారని తెలుస్తుంది . డేటా సమిష్టిగా ఉందని, నేడు జరిగే సమావేశంలో ఆయనకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
Tags:    
  • Pandemic crisis 
  • Corruption 
  • 40000 Complaints 
  • Modi 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS