• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అంత గొప్ప ఎన్టీఆర్...

అంత గొప్ప ఎన్టీఆర్ లక్షీపార్వతికి ఎలా పడిపోయాడో?: వర్మ

By - Tupaki Desk
Update: 2017-09-20 18:15 GMT
    ఎన్టీఆర్ అంటే రాజకీయాలు, సినిమాలు రెండిట్లోనూ టాప్ హీరోయే. ఎందరో అందమైన హీరోయిన్లతో ఆడిపాడిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తరువాత చాలాకాలానికి లక్షీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం తెలుగు రాజకీయాలనే మలుపుతిప్పేసింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆ పరిణామాలు తాజా వార్తలుగానే ఉంటున్నాయంటే వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎలా ఉన్నా.... వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎన్టీఆర్ పై సినిమా తీయడానికి రెడీ అవుతుండడం.. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఇది హాట్ టాపిక్ అయింది. రాంగోపాల్ వర్మ తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రెండో పెళ్లిపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. జయప్రద, శ్రీదేవి వంటి అలనాటి అందాల తారలతో నటించిన ఆయన సాధారణ మహిళ అయిన లక్ష్మీపార్వతి పట్ల ఎలా ఆకర్షితులయ్యారో తెలుసుకోవాలన్న కోరిక తనకు కలిగిందని.. అందుకే ఎన్టీఆర్ జీవితంలోని పలు పరిణామాలను, కీలక ఘట్టాలను స్టడీ చేసి ఈ సినిమా తీస్తున్నానని ఆయన వివరించారు.

    కాగా, రామారావు జీవిత చరిత్రపై తీస్తున్న సినిమాకు ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్‌ను పెట్టిన  విషయం తెలిసిందే. ఈ సినిమాను లక్ష్మీపార్వతి దృష్టికోణం నుంచి తీయ‌బోతున్నాన‌ని ఆయన ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతుండడంతో అటు టీడీపీలో కూడా దీనిపై కాస్త కంగారు పడుతోంది. అసలే వర్మ... ఆపై ఎన్టీఆర్ పై సినిమా... దీంతో ఆయన ఏం చూపిస్తారో.. ఎవరిని విలన్ చేస్తారో అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వర్రీ అవుతున్నట్లు టాక్.

    టీడీపీ ఆందోళనను మరింత పెంచేలా వర్మ ఈ రోజు తన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ‌యోపిక్ అంటే ఓ మ‌నిషి పుట్టిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయేవ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీస్తార‌ని, అలా కాకుండా ఓ కీల‌క సంఘ‌ట‌న నుంచి కూడా మొద‌ల‌వుతుంద‌ని చెప్పారు. గ‌తంలో మ‌హాత్మాగాంధీ బ‌యోపిక్‌ని ఆయ‌నను రైల్లోంచి తోసేసిన ఘ‌ట‌న నుంచి మొద‌లు పెట్టార‌ని వర్మ గుర్తు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో తాను కూడా రామారావు జీవితంలో జ‌రిగిన కీల‌క సంఘ‌ట‌న నుంచి మొద‌లుపెడ‌తాన‌ని చెప్పారు. దీంతో అది ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సీనుతో మొదలవుతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది.
Tags:    
  • RGV Lakshmis NTR 
  • Lakshmis NTRNTR 
  • Lakshmi Parvathi 
  • Ram Gopal Varma 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS