సెలబ్రిటీస్ రెండవ పెళ్లి చేసుకొని సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారా?

Update: 2021-02-16 08:30 GMT
మిగిలిన విష‌యాల ప్ర‌స్తావ‌న ఇక్క‌డ లేదు.. కేవ‌లం పెళ్లి గురించిన చ‌ర్చ ఇది. ప్ర‌పంచం మొత్తంలో అత్యున్న‌త‌మైన దాంప‌త్య జీవ‌న విధానం ఏదంటే.. భార‌తీయ వైవాహిక జీవితాన్నే సూచిస్తాయి మెజారిటీ దేశాలు! రెండు మూర‌ల తాడు.. మూడు ముళ్లు వేసుకొని.. నూరేళ్ల జీవితాన్ని ఎలా ముడేస్తుందా? అని ముచ్చ‌ట‌ప‌డి చూస్తుంటాయి పాశ్చాత్య దేశాలు. దానికి కార‌ణం లేక‌పోలేదు. వాళ పెళ్లి బంధం అంత పెళుసుగా ఉంటుంది మ‌రి! అందుకే.. భార‌తీయ ప‌సుపు గొమ్ములోని మ‌హ‌త్మ్యం ఏంటా.. అని ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటాయి. అయితే.. ఇప్పుడు ఈ సంప్ర‌దాయానికి బీట‌లు వారుతున్నాయా? అనే చ‌ర్చ మొద‌లైంది. దీనికి సెల‌బ్రిటీలు తొలి కార‌ణం అవుతున్నారా? అనే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

సంప్రదాయం మసకబారుతోందా?

ఇక్క‌డ చ‌ర్చ వ్య‌క్తుల‌కు సంబంధించిన‌ది కాదు.. వ్య‌వ‌స్థ‌కు చెందిన‌ది. ఒక రంగానికి చెందిన వారి గురించి కాదు.. అన్ని వ‌ర్గాల వారికి సంబంధించిన‌ది. మొత్తం భార‌తీయ సంప్ర‌దాయానికి మూలం గురించి. మ‌న ఆచారాల ప్ర‌కారం పెళ్లి అనేది అత్యంత ప‌విత్ర‌మైన విష‌యం. స్త్రీపురుషుల క‌ల‌యిక అనేది ప‌విత్ర‌మైన సృష్టి కార్యం. అయితే.. పాశ్చాత్య‌పు వాస‌నలు గుబాళిస్తున్న ఈ త‌రంలో.. ఒకే భార్య‌, ఒకే భ‌ర్త అనే సిద్ధాంతం మ‌స‌క‌బారుతోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పాశ్చాత్య సంప్ర‌దాయం..

ఒక‌సారి ఇద్దరు ఒక్కటైతే.. చ‌నిపోయే వ‌ర‌కూ జీవిత భాగస్వాములుగా ఉండాల‌నేది మెజారిటీ స‌మాజం క‌ట్టుబాటు. కానీ.. ఇది వేగంగా పతనమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి యూరప్ కంట్రీస్ లో దశాబ్దాల క్రితమే స్పీడ్ అందుకుంది.  2013లో అమెరికాలో పీఈడబ్ల్యూ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం.. అక్కడ పది వివాహాలు జరిగితే.. అందులో నాలుగు పెళ్లిల్లో ఒక భాగస్వామికి రెండో పెళ్లికి సిద్ధమైన వారు ఉనట్టు తేలిందట! ఈ ప‌రిస్థితి రాను రానూ మ‌రింత తీవ్రంగా మారుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

వేగంగా మార్పు..

ఈ ఫారెన్ క‌ల్చ‌ర్ ఇప్పుడు ఇండియాలో కూడా వేళ్లూనుకుంటోందా? అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే.. ఇందులో మెజారిటీ వాటా సెల‌బ్రిటీలదే అనే విష‌యంలో సందేహం అక్క‌ర్లేదు. సినిమా రంగం కావొచ్చు.. వ్యాపార రంగం కావొచ్చు.. ఇంకా మ‌రేదైనా వ‌ర్గం కావొచ్చు.. సెల‌బ్రిటీలుగా ఉన్న‌వారిలోనే రెండు లేదా అంత‌కు మించిన విహాలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు చాలా మంది. విదేశాల్లో ఎక్కుగా ఉండే ఈ క‌ల్చ‌ర్ రాను రానూ మ‌న దేశంలో కూడా పెరిగిపోతోంద‌ని స‌నాత‌న సాంప్ర‌దాయ వాదులు ఆవేద‌న చెందుతున్నారు.

ముందున్న‌ది వారే..

గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ విష‌యంపై చ‌ర్చలు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. రెండు, అంత‌కు మించిన పెళ్లిళ్ల‌పై మాట్లాడుకుంటున్న నాటి త‌రం వారు.. ఆ రోజుల్లోని విష‌యాల‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఒక‌సారి భాగ‌స్వామికి చేతి ప‌ట్టుకున్న త‌ర్వాత‌.. ఎలాంటి క‌ష్టాలు ఎదురైనా, ఎన్ని అభిప్రాయ భేదాలు వ‌చ్చినా.. త‌మ‌లో తాము స‌ర్దుకు పోవ‌డం చేసేవారు. స‌యోధ్య కుద‌ర‌లేదంటే పెద్ద‌లు మ‌ధ్య వ‌ర్తిత్వంతో రాజీ కుదిర్చేవారు. మ‌ళ్లీ సంసాస‌ర సాగ‌రంలో వారి ప్ర‌యాణం ముందుకు సాగేది. ఇప్ప‌టికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప‌రిస్థితి ఉంది. కానీ.. ఉన్న‌త వ‌ర్గంగా చెప్పుకుంటున్న వారి విష‌యంలోనే ఈ వ్య‌వ‌స్థ‌ ప‌ట్టు త‌ప్పుతోందన్న అభిప్రాయం బ‌లంగా వ్య‌క్త‌మ‌వుతోంది.

క‌ష్టాలు కొని తెచ్చుకుంటున్నారా?

ఆర్థికంగా బ‌ల‌ప‌డిన వారు మూడో వ్య‌క్తి జోక్యాన్ని స‌హించే స్థితిలో ఉండ‌ట్లేద‌ని, ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చినా.. మూడు ముళ్లు తెంపేసుకోవ‌డ‌మే అంతిమ ప‌రిష్కారంగా భావిస్తున్నారంటున్నారు చాలా మంది. త‌ద్వారా.. పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ చందంగా.. త‌మ జీవితాల‌ను మ‌రింత‌గా స‌మ‌స్య సుడిగుండంలోకి నెట్టేసుకుంటున్నారు. త‌మ‌కు తెలియ‌కుండానే వారి సంతానాన్ని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ‘మా జీవితం మా ఇష్టం..’ అనే రీతిలో త‌మ‌కు న‌చ్చింది తాము చేసుకుంటామ‌న్నట్టుగా ముందుకు సాగుతూ.. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మూడు ముళ్లను విప్పేసుకొని వెళ్లిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు.

ఒక‌రికి ఒక‌రుగా ఉంటేనే...

ఎవరి జీవితం వారిదే కావొచ్చు గాక.. నిర్ణయాధికారం కూడా వారికే ఉండొచ్చు గాక.. కానీ, తమ నిర్ణయం తమ జీవితాలతోపాటు.. తమ పిల్లల జీవితాలతోపాటు.. ప్రపంచం మెచ్చిన సాంప్రదాయాన్ని ధ్వంసం చేసేదిగా మారుతున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలన్నది మెజారిటీ ప్రజల సూచన. ఒక జంటలు వదిలి వెళ్లొచ్చు, కానీ.. మళ్లీ జట్టుకట్టబోయేది అదే మగాడితో కదా..? అదే మ‌హిళ‌తో క‌దా..? అక్క‌డ కూడా ఇలాంటి స‌మ‌స్య‌లు రావ‌ని చెప్ప‌లేం క‌దా..? కాబట్టి.. సాధ్యమైనంత వరకు సమస్యలను తుంచి వేయడానికి ప్రయత్నించాలే తప్ప, మూడు ముళ్ల బంధాన్ని తెంచుకోవద్దనేది పెద్దలు చెప్పే మాట. ఈ తరహా వివాహాలతో ప్రస్తుతం చ‌ర్చ‌ల్లో ఉన్న‌వారు మొద‌టి వారు కాదు.. చివ‌రి వారు కూడా కాబోరు. కానీ.. ఇలాంటి పద్ధతుల ద్వారా భారతీయ వివాహ వ్యవస్థకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాళిబొట్టుకు ఎన్ని ముళ్లు వేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అంతకు మించి అనుకుంటు సాగే ఈ ముళ్లు.. జీవితాన్ని ముళ్లబాటగా మారుస్తాయన్నది పెద్దల సూచన. మేమిద్దరం.. ఒకరికి ఒకరం అన్నట్టుగా సాగితేనే సంసార సాగర ప్రయాణం ప్రశాంతంగా తీరానికి చేరుతుందనేది వారి హితవు.
Tags:    

Similar News