వేలానికి హిట్లర్ టాయిలెట్ సీట్.. ధర ఎంతంటే?
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచంపై దండెత్తిన జర్మనీ నియంత హిట్లర్ మరణశాసనాన్ని లిఖించాడు. అన్ని దేశాలపైకి యుద్ధం ప్రకటించి చివరకు ఓడిపోయి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే హిట్లర్ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు తన గదిలో ఓ టాయిలెట్ ఉండేది. ఆ టాయిలెట్ సీట్ ను రాంగ్ వాల్ట్ సి బోర్చ్ అనే అమెరికా సైనికుడు ఎత్తుకెళ్లాడు.రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీని అమెరికా సైనికులు చుట్టుముట్టిన సమయంలో సైనికుడు ఆ టాయిలెట్ సీట్ ను దొంగిలించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి న్యూయార్క్ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు.
ఇప్పటివరకు హిట్లర్ వాడిన టాయిలెట్ సీట్ ను తన వద్దే ఉంచుకున్నాడు. కాగా ఇప్పుడు దానిని ఆయన కుటుంబ సభ్యులు వేలం వేయబోతున్నారు. వేలంలో ప్రారంభ ధరగా 5000 డాలర్లుగా నిర్ణయించారట.. వచ్చేవారం ఈ టాయిలెట్ సీటును వేలం వేస్తారు. దాదాపుగా 15000 డాలర్లకు ఈ టాయిలెట్ సీటు అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్టు వేలం నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.