• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జూన్ 1 నుంచి ఆలయాల్లో...

జూన్ 1 నుంచి ఆలయాల్లో దర్శనాలకి అనుమతి!

By - Tupaki Desk
Update: 2020-05-27 07:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశంలోని అన్ని ఆలయాల్లో దర్శనాలను నిలిపేశారు. కేవలం ఏకాంతంగా మాత్రమే ఆలయాల్లో అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే , ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న నాలుగోదశ లాక్ డౌన్ నుండి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు, ప్రజా రవాణా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే, జన సాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, థియేటర్లు, ప్రార్ధనా మందిరాలను మాత్రం కేంద్రం మూసి ఉంచింది.

ఇకపోతే , రోజురోజుకి దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని  ఆలయాల్లో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1 నుంచి కర్నాటక వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో భక్తల దర్శనాలకు అనుమతిస్తున్నట్లు మంత్రి కోటా శ్రీనివాస్ తెలిపారు. అలాగే,మే 31లోగా దేవాలయాల్లో అవసరమైన మార్పులు చేస్తామని.. దర్శనాల సమీపంలో ప్రామాణిక నిర్వహణ పద్దతులను  పాటిస్తూ దర్శనాలు చేసుకోవచ్చని చెప్పారు.

దీని కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచే 52 దేవాలయాలకు సంబంధించి ఆన్ లైన్ సేవల బుకింగ్‌ ను ప్రారంభిస్తామన్నారు. కాగా, ఉత్సవాలు, పర్వదినాలను జరుపుకునేందుకు మాత్రం అనుమతి లేదని సీఎం యడ్యూరప్ప స్పష్టం చేశారు. కాగా, కర్నాటకలో ఇప్పటి వరకు 2,282 వైరస్  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో  మహమ్మారితో పోరాడుతూ 722 మంది కోలుకోగా.. 44 మంది మరణించారు. ప్రస్తుతం కర్నాటకలో 1,514 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Tags:    
  • Hindu temples 
  • reopen on June 
  • Andhra Pradesh 
  • Telangana 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS