ఈడీ కొరఢా: 200 కోట్ల కుంభకోణం ఉచ్చులో హీరోయిన్?

Update: 2021-08-26 01:30 GMT
ఢిల్లీలో ఇటీవల అతిపెద్ద దోపిడీ రాకెట్ న్యూస్ హైలెట్ అయ్యింది. ఆ కేసు విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు.  ఈ కేసు విషయంలో టాప్ సెలబ్రెటీలను సైతం ఈ కేసు విషయంలో విచారణ జరుపుతున్నారు. మద్రాస్ కేఫ్ నటీమణి లీనా మారియాపై కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 200 కోట్ల దోపిడీ కేసులో 'మద్రాస్ కేఫ్' నటి లీనా మరియా పాల్ ను ఈడీ విచారించినట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఈ కేసు విషయంలో అధికారులు ఇటీవల 16 హైఎండ్ కార్లతోపాటు.. చెన్నైలో ఉన్న ఒక విలాసవంతమైన బీచ్ ఫ్రంట్ బంగ్లా, రూ.82.5 లక్షల నగదు, మరియు మనీలాండరింగ్ లో 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రమేయం ఉన్నందుకు ఏడుగురితోపాటు ఇటీవల అరెస్ట్ అయిన కొంతమంది ప్రముఖులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

2013లో విడుదలైన 'మద్రాస్ కేఫ్' చిత్రంలో నటించిన సుకేశ్ చంద్రశేఖర్ స్నేహితురాలు నటి లీనా మారియా పాల్ ను కూడా ఈడీ అధికారులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇదివరకే ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. భారీ స్థాయిలో మోసం చేయడమే కాకుండా అమాయక జనాలను కూడా మోసం చేసినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News