పూలు కురవలేదు కానీ వీరి పెళ్లిలో మంచు కురిసింది.. సో స్పెషల్

శుక్రవారం వసంత పంచమి వేళ.. ఈ ఆలయంలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన పలువురు అందుకు తగ్గట్లే ప్లాన్ చేసుకున్నారు.;

Update: 2026-01-25 12:30 GMT

రీల్ సీన్ కు ఏ మాత్రం తగ్గని ఈ రియల్ సీన్ ను.. రానున్న రోజుల్లో ఏదైనా సినిమాలోకి ఇట్టే వాడేయొచ్చు. విన్నంతనే చలి వణుకు పుట్టొచ్చు కానీ.. మొత్తం చదివిన తర్వాత మాత్రం ఈ తరహాలో పెళ్లి చేసుకోవాలంటే కోట్లాది రూపాయిలు ఉన్నా కుదరదు.. కేవలం ప్రకృతి మాత్రమే ఈ తరహా స్క్రిప్టు రాస్తుందని చెప్పాలి. పరమ శివుడు.. పార్వతిలు స్వయంగా పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పే ప్రదేశంగా ఉత్తరాఖండ్ లోని జంగల్ చట్టిలోని త్రియుగినారాయణ టెంపుల్ ఫేమస్. అందుకే.. కొత్తగా పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకునేవాళ్లు.. ఈ ఫేమస్ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవటానికి ఆసక్తిని చూపుతుంటారు.

శుక్రవారం వసంత పంచమి వేళ.. ఈ ఆలయంలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన పలువురు అందుకు తగ్గట్లే ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా పలు జంటలు.. వారి కుటుంబ సభ్యులు ఈ గుడడికి ప్రయాణమయ్యారు. అయితే.. ఇటీవల కాలంలో భారీగా కురుస్తున్న మంచుతో అక్కడి రోడ్లు మొత్తం బ్లాక్ అయ్యాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం నెలకొంది.

దీంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఓవైపు దట్టంగా కురుస్తున్న మంచు. మరోవైపు ఎంతకూ ముందుకు కదలని వాహనాలు. ముహుర్తం ముంచుకొస్తున్న వేళలో.. వధూవరులు, వారి కుటుంబ సభ్యులు తాము ప్రయాణిస్తున్న వాహనాల్ని విడిచి పెట్టి.. ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు. భారీగా మంచు కురిసే వేళలో.. పెళ్లి చేసుకున్నాయి కొన్ని జంటలు. అలాంటి కోవలోకే వస్తుంది మేరఠ్ కు చెందిన సూరజ్.. దీక్షల పెళ్లి. సాధారణంగా ఘనంగా పెళ్లిళ్లు చేసుకునే వేడుకల్లో పూల వర్షం కురిపిస్తుంటారు. అయితే.. ఇది ప్రకృతి రాసిన స్క్రిప్టు కావటంతో పూలకు బదులు..

మంచు తుంపరులుగా కురిసి.. అక్కడి వారందరికి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని.. అనుభూతిని మిగిల్చింది. ఈ పెళ్లిని తమ జీవితంలో మర్చిపోలేమని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News