వీడేం నాన్న.. అంకెలు రాయలేదని కూతుర్ని నేలకేసి కొట్టి చంపాడు

ఈ పైశాచిక ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఫరీదాబాద్ లో చోటు చేసుకుంది. కన్నకూతురు ప్రాణాల్ని తీసిన ఈ కసాయి దుర్మార్గం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.;

Update: 2026-01-25 09:30 GMT

నాన్నంటే.. కంటి కనురెప్పలాంటోడు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పిల్లల యోగక్షేమాల కోసం తపిస్తుంటాడు. అలాంటి తీరుకు భిన్నంగా.. నాన్న అనే మాటకు అపచారాన్ని అపాదించాడో దుర్మార్గుడు. నాలుగున్నరేళ్ల పసికందు అంకెలు సరిగా రాయలేదన్న కోపంతో అత్యంత కిరాతకంగా వ్యవహరించి.. ఆ చిన్ని ప్రాణాన్ని తీసిన ఈ దుర్మార్గం గురించి విన్నంతనే మనసంతా చేదుగా మారిపోతుంది.

ఈ పైశాచిక ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఫరీదాబాద్ లో చోటు చేసుకుంది. కన్నకూతురు ప్రాణాల్ని తీసిన ఈ కసాయి దుర్మార్గం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తాను చేసిన దుర్మార్గాన్ని అటు వైద్యులకు.. భార్యకు చెప్పకుండా మేనేజ్ చేసే ప్రయత్నం చేసినప్పటికి వీడి పాపం పండింది. పోలీసుల చేతిలో ఉన్న ఇతడి ఉదంతంలోకి వెళితే.. 31 ఏళ్ల క్రిష్ణ జైస్వాల్.. రంజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు అబ్బాయి అయితే.. రెండో బిడ్డ అమ్మాయి.

నాలుగున్నరేళ్ల వంశిక అంకెలు సరిగా రాయటం లేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తండ్రి.. ఆమెను అప్పడాల కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఇంతకూ ఆమె చేసిన తప్పు.. ఒకటి నుంచి యాభై వరకు అంకెల్ని సరిగా రాయకపోవటమే. ఇష్టారాజ్యంగా కూతుర్ని కొట్టిన ఆ పశువు.. అప్పటికి తన కోపాన్ని చల్లార్చకుండా ఆ చిన్నారిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో పాప తలకు తీవ్ర గాయాలయ్యాయి,ఆ తర్వాత తానే కుమార్తె వంశికను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంత దెబ్బ ఎలా తగిలిందని వైద్యులు అడిగితే మెట్ల మీద నుంచి కిందకు జారి పడటంతో దెబ్బలు తగిలాయని కట్టుకథ అల్లాడు. భార్య రంజితకు అదే కథను రిపీట్ చేశాడు. వైద్యులు చికిత్స చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర గాయాలతో ఆ పసిప్రాణం పోయింది.

వీడు తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్న వేళలో ఏడేళ్ల కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. వాడు తన తల్లికి ఇంట్లో జరిగింది జరిగినట్లుగా వివరించాడు. దీంతో ఆమె భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఈ కసాయిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News