• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా విజిటర్ వీసాల...

అమెరికా విజిటర్ వీసాల కోసం 2 ఏళ్లు ఆగాల్సిందే

By - Tupaki Desk
Update: 2022-09-17 16:30 GMT
అమెరికా టూర్ కు ప్లాన్ చేస్తున్నారా? అగ్రరాజ్యంలో అలా విహరించడానికి వెళుతున్నారా? అయితే ఇప్పట్లో ఆ దేశానికి వెళ్లడం కష్టమే. కనీసం రెండేళ్ల వరకూ కూడా ఖాళీలేని పరిస్తితి. అంతలా రష్ ఉంది మరీ.. అమెరికాకు  సందర్శకుల వీసాల జారీలో విపరీతమైన జాప్యం భారతీయుల ప్రయాణ ప్రణాళికలు.. బడ్జెట్‌లను గందరగోళానికి గురిచేస్తోంది. మొదటిసారిగా అమెరికాకు వలసేతర విజిటర్ వీసా పొందాలనుకునే భారతీయ పౌరులు దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం.. వీసా కోరుకునే దరఖాస్తుదారులు ఢిల్లీ, ముంబైలో వరుసగా 758 మరియు 752 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతగా వెయిటింగ్ పీరియడ్ ఉంది.

విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లాలనుకునే దరఖాస్తుదారులు ముంబై , ఢిల్లీ  రెండు నగరాల్లో అక్టోబర్ 2024 నాటికి అపాయింట్‌మెంట్ పొందుతారు. కేవలం ఒక నెల క్రితం.. సందర్శకుల వీసాల కోసం ఆశించే వారు వేచి ఉండే సమయం ఢిల్లీ , ముంబైలలో 581 మరియు 517 రోజులు ఉండేది. కరోనా మహమ్మారి తగ్గడంతో ఇప్పుడు అందరూ విదేశాలకు వెళ్లడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అందుకోసం ఎగబడుతున్నారు. దీంతో  వీరి ప్రయాణానికి  డిమాండ్‌ కు సరిపడా అమెరికా ప్రభుత్వం వీసాల జారీని చేయడం లేదు.  ఇది ఎక్కువ కాలం వేచిఉండేలా చేస్తోంది.

నిరీక్షణ సమయం తగ్గే అవకాశం ఉంది. వచ్చే వేసవి నాటికి పరిస్థితిలో మెరుగుదల ఉండవచ్చు, భారతదేశంలోని అమెరికా ఎంబసీ కోవిడ్ ముందు చాలా సిబ్బందిని తొలగించింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ సిబ్బందిని పెంచాలని భావిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా అన్ని వీసా తరగతులలో వేచి ఉండే సమయాన్ని తగ్గించే లక్ష్యంతో ఉన్నామని.. మహమ్మారి సమయంలో దాదాపు పూర్తి షట్‌డౌన్ తో వనరులను స్తంభింపచేసిన తర్వాత వీసా ప్రాసెసింగ్ సాధారణ స్థితికి వస్తోందని అమెరికా తెలిపింది.

ఈ వేసవిలో భారతదేశంలోని అమెరికా ఇమ్మిగ్రేషన్ రికార్డు స్థాయిలో 82,000 విద్యార్థి వీసాలను జారీ చేసింది. B1/B2 టూరిజం, వ్యాపార వీసాలు వేగవంతం అవుతున్నాయి. వచ్చే వేసవి నాటికి సిబ్బందిని పెంచుతామని.. ఇది వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందని అమెరికా ఎంబసీలోని ఒక అధికారి తెలిపారు.

ఏది ఏమైనప్పటికీ సెప్టెంబరులో అమెరికాకి వెళ్లే అన్ని విమానాలు నిండినందున ప్రయాణాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.    ఇప్పటికీ  అమెరికా వీసా దొరక్క వెళ్లలేని వారు కెనడా విద్యార్థి వీసాలను పొందుతున్నారు.  అనేక వన్-స్టాప్ విమానాలు కెనడాకు బయలుదేరే విద్యార్థులతో నిండి ఉన్నాయి. విద్యార్థుల రద్దీ తగ్గిన తర్వాత ఛార్జీలు కూడా సరసమైన స్థాయికి వస్తాయని ట్రావెల్ ఏజెంట్ చెప్పారు.

వీసాల జారీలో జాప్యం ప్రధానంగా మొదటిసారి వీసా దరఖాస్తుదారులకు మాత్రమే. ఇదివరకు వెళ్లినవారు.. మరోసారి వెళ్లాలనుకునే వారికి వీసాలు త్వరగానే లభిస్తున్నాయి.  ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా ఈ జాప్యం జరుగుతోందని అమెరికా ఎంబసీలోని మరో అధికారి తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • UnitedStatesofAmerica 
  • USAVisitingVisa 
  • AmericaVisa 
  • AmericaStateDepartment 
  • AmericaImmigration 
  • VisitingVisas 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS