లోకేష్ డ్రెస్ స్టైల్ ఛేంజ్ అయ్యిందా?

Update: 2021-02-04 10:45 GMT
బందరు లడ్డూలా ఉండే టీడీపీ భావి వారసుడు బంగారు తీగలా మారేసరికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట. కాబోయే టీడీపీ అధినేత ఉబకాయం నుంచి బయటపడి నాజూకుగా తయారయ్యేసరికి కథ వేరే లెవల్లో ఉందట.  లోకేష్ బరువు తగ్గి స్టైల్ గా ఉండి ప్రజల దగ్గరికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడేమో.. అందుకే ఇలా వర్కవుట్స్ చేశాడేమోనని  అనుకుంటున్నారు.

నారా లోకేష్ లో ఈ మార్పు ఊరికే రాలేదంట..  ఈ మధ్య లాక్ డౌన్ లో ఫిటెనెస్ ట్రైనర్ తో ట్రైనింగ్ అయిన తర్వాత దాదాపు 30 కిలోలు లోకేష్ తగ్గాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి.  గత మూడు నెలల నుంచి ఒకే డ్రెస్ స్టైల్ లో అవే డ్రెస్ లు లోకేష్ వేస్తున్నారు. బ్లాక్ స్లిమ్ పాయింట్ దాని వైట్ కాటన్ షర్ట్ రౌండ్ షేప్ తో వేస్తున్నాడు.

ఇంకా స్లిమ్ అయ్యి యూత్ కు దగ్గర కావాలని లోకేష్ తపన పడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.  అయితే ఇంకా నారా లోకేష్ ప్రసంగంలో ఆ మెచ్చురిటీ రాలేదని అంటున్నారు. స్పీచ్ థెరపీ కూడా ఇంట్లో ట్రైనింగ్ అవుతున్నాడని.. గతంలో ఒక ప్రముఖ చానెల్ లో పనిచేస్తున్న కంటెంట్ రైటర్ ను పీఏగా పెట్టుకొని అతడి పంచ్ డైలాగులు వాడుతున్నాడని భోగట్టా..

ఇంకా స్పీచ్ లో ఇంప్రూవ్ కావాలని చంద్రబాబు చెప్తున్నాడంట.. టీడీపీ శ్రేణుల్లో కొంచెం లోకేష్ పట్ల ఇంతకుముందు ఉన్న చెడ్డ ప్రచారం ఇప్పుడు తగ్గిపోయిందంట.. ఇప్పుడు లోకేష్ ప్రజల్లోకి వెళ్లి అన్యాయాలపై నిలదీస్తున్న తీరుతో అతడి పట్ల పాజిటివ్ మూడ్ ప్రజల్లో వచ్చిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.  

నారా బాబు ఈ మధ్య ఏపీలో టీడీపీ నేతలపై దాడులు, హత్యలు, కేసులపై తీవ్రంగా స్పందిస్తున్నాడు. తెలుగు యువత నేతలు అరెస్ట్ అయితే లాయర్లను పెట్టి మరీ వారిని బయటకు తీసుకొస్తున్నాడట.. వారి విడుదల అవుతున్న జైళ్ల వద్దకు వెళ్లి మరీ స్వాగతం పలుకుతున్నారు. లోకేష్ టీడీపీ నేతలకు ఇస్తున్న భరోసాతో ఇప్పుడు వారంతా లోకేష్ ను హీరోగా చూస్తున్నారట.. రోజురోజుకు టీడీపీలో లోకేష్ ప్రతిష్ట పెరుగుతోందని చెబుతున్నారు.
Tags:    

Similar News