కేంద్రం కీలక నిర్ణయం: ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు
కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుర్వేద వైద్యులు ఇకపై శస్త్రచికిత్సలు చేసే వీలుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. దీనికి కొన్ని పరిమితుల్ని విధించారు. ఆయుర్వేదంలో పీజీ చేసిన వారికి శస్త్రచికిత్సల్లో శిక్షణ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అప్పుడే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన వైద్యంతో ఆధునాతన వైద్యాన్ని కలిపే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే.. ఈ విమర్శల్ని కేంద్రం ఖండిస్తోంది. తమ ఉత్తర్వుల మీద పూర్తి క్లారిటీ ఇస్తోంది. తాము విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయుర్వేద పీజీ చేసిన వారిలో కేవలం 58 రకాల శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు ఉంటుంది. అది కూడా అనవసరమైన కణితుల్ని తొలగించటం.. పళ్లు.. కళ్లు.. ముక్కు సంబంధిత ఆపరేషన్లను చేసే వీలుంది.
మొత్తం సర్జరీల్ని ఆయుర్వేద వైద్యులు చేసే వీలు లేదని స్పష్టం చేస్తున్నారు. కొన్ని అంశాల్లోనే వారికి అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. పాతికేళ్లుగా ఆయుర్వేద సంస్థలు సర్జరీలు చేస్తున్నాయని.. ఇప్పుడు అలాంటి వాటికి చట్టబద్ధత ఇచ్చినట్లుగా వివరిస్తున్నారు. తాజా నిర్ణయంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్న వాదనను ఖండిస్తున్నారు.
ఎందుకంటే.. ఇప్పటివరకు ఆయుర్వేదంలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదన్న విషయంపై స్పష్టత లేదని.. తాజా ఉత్తర్వులతో స్పష్టత రావటంతో పాటు.. ఏమేం చేయొచ్చన్న విషయం అందరికి తెలుస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్నో తిరోగమన చర్యగా అభివర్ణించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. నీట్ లాంటి పరీక్షలకు విలువ ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.