షాకింగ్ గా మారిన సీరమ్ తీరు..అలాంటి గేమ్ ఆడిందా?

Update: 2020-09-10 09:30 GMT
వ్యాపారంలో గుట్టు అవసరం. కానీ.. కొన్ని కీలకాంశాల్ని ప్రజలకు చెప్పకున్నా ఫర్లేదు.. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం తప్పనిసరి. అందుకు భిన్నంగా మౌనంగా ఉండటం.. ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం తప్పే అవుతుంది. ఆ లెక్కన చూస్తే.. ఫూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ పెద్ద తప్పే చేసిందని చెప్పాలి.

కోవిడ్ 19 వ్యాక్సిన్ కనుగునే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వందకు పైగా పరిశోధనలు సాగుతున్నా.. అందరి చూపు మాత్రం ఆక్స్ ఫర్డ్ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ మీద ఎక్కువమంది ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆక్స్ ఫర్డ్ వర్సిటీ పలు దేశాల్లో కొద్దిమందితో భాగస్వామ్య ఒప్పందాల్ని కుదుర్చుకుంది. తాము చేసే ప్రయోగాలకు అనుబంధంగా.. అనుసంధానం చేసుకునేలా పరిశోధనలు సాగుతుంటాయి.

ఇదిలా ఉంటే.. ఆక్స్‌ఫర్డ్‌ నిర్వహిస్తున్న ప్రయోగాల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోకపోవటంతో.. తమ పరిశోధనల్ని ఆపినట్లుగా పేర్కొంది. మరి.. ఇంతటి కీలక సమాచారాన్ని తన అనుబంధం సంస్థలకు కూడా తెలియజేస్తుంి. అలాంటప్పుడు సీరమ్ కు ముందే సమాచారం వచ్చి ఉండాలి. కానీ.. ఆ సంస్థ మాత్రం ఆ వివరాల్ని ప్రభుత్వానికి వెల్లడించకపోవటం ఇప్పుడు వివాదంగా మారింది.

అయితే.. తాము నిర్వహిస్తున్న ప్రయోగాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని సీరమ్ ఇనిస్టిట్యూట్ చెబుతోంది. రెండో దశలో వంద మంది వలంటీర్ల మీద వ్యాక్సిన్ ప్రయోగిస్తే.. ప్రయోగంలో కీలకంగా భావించే ఏడు రోజులు దాటినా ఎవరిలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని స్పష్టం చేసింది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి విదేశాల్లో ప్రయోగాలు నిలిపివేసిన సమాచారాన్ని తమకు ఇవ్వని వైనంపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులకు సమాచారం వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో తదుపరి చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో.. కీలక సమాచారాన్ని దాచేసిన సీరమ్ కు ఇప్పుడు కొత్త తిప్పలు చుట్టుకున్నట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News