గోరిల్లా గ్లూ.. జర జాగ్రత్త.. ఆటలాడితే ఆసుపత్రి పాలే

Update: 2021-02-16 01:30 GMT
బుల్లి వీడియోలు.. చిట్టి వీడియోలు చేయటం.. వాటిని అందరికి పంచుకోవటం సులువుగా మారిన వేళ.. పేరు కోసం.. సమ్ థింగ్ స్పెషల్ గా ఉండేందుకు చేసే కొన్ని ప్రయత్నాలు బెడిసికొట్టటమేకాదు.. ఆరోగ్యం దెబ్బ తిని ఆసుపత్రి పాలవుతున్న దుస్థితి. తాజాగా అలాంటి రెండు ఉదంతాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గోరిల్లా గ్లూతో ఆటలాడటం.. దాంతో ప్రయోగం చేయాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టటమే కాదు.. మొదటికే మోసం వచ్చిన పరిస్థితి. ఈ రెండు ఉదంతాల్ని చదివిన తర్వాత.. గోరిల్లా గ్లూ జోలికి వెళ్లాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించటం ఖాయం. ఇంతకూ ఏం జరిగిందంటే..

టెస్సికా బ్రౌన్ అనే అమ్మాయి.. హెయిర్ స్టైల్ లో సరికొత్త ప్రయోగం చేద్దామని.. గోరిల్లా గ్లూను స్ప్రేను తలపై చేసుకుంది. ఈ పిచ్చి చేష్టతో ఆమె జుట్టు తలకు అతుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా గ్లూ పోకపోవటంతో ఆసుపత్రిలో చేరింది. అతి కష్టమ్మీదా ఆమె తలపైన ఉన్న గ్లూను వైద్యులు తీశారు. కాకుంటే 12వేలకు పైగా డాలర్ల ఖర్చు ఆమెకు వచ్చింది. దీంతో.. అంత డబ్బులు లేని ఆమె.. నెటిజన్ల సాయం కోరింది. దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తే.. మరికొందరు తిట్టిపోశారు. ఓవర్ చేయటం ఎందుకు? ఇప్పుడు ఇలా ఆర్థిక సాయం కోరటం ఎందుకు? అంటూ ప్రశ్నించారు. మరికొందరు అయితే.. అంత ఖర్చు ఎందుకు అవుతుందని నిలదీసినోళ్లు లేకపోలేదు.

ఇదిలా ఉంటే.. టెస్సికా పోస్టుకు స్పందించిన లెన్ మార్టిన్ అనే నెటిజన్.. ఆమె అబద్ధం చెబుతుందని.. గ్లూను ఎంత సింఫుల్ గా వదిలించుకోవచ్చో తాను చూపిస్తానంటూ ఒక చెత్త ప్రయోగం చేశాడు. గోరిల్లా గ్లూను ఒక ప్లాస్టిక్ కప్ కు రుద్ది.. దాన్ని తన పెదాలపై పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి అతనికి కొత్త సమస్యలు మొదలయ్యాయి. పెదాలను..కప్ ను వేరు చేయాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో మార్టిన్ ఆసుపత్రి పాలయ్యాడు. అతను చేసిన ప్రయోగ వీడియో.. ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

తన ప్రయోగం సక్సెస్ అవుతుందని అనుకున్నానని.. ఇప్పుడు తన పెదాల్ని తొలగిస్తామని వైద్యులు చెప్పినట్లుగా వాపోయాడు. ఇతడి పోస్టుకు నెటిజన్లు తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. తెలివి తక్కువ పని చేయటం ఎందుకు? అని తలంటుతున్నారు. అయినా.. పిచ్చ పిచ్చ ప్రయోగాలు చేయటం ఎందుకు? కాస్త పనికి వచ్చే పని చేస్తే బాగుండేది కదా? అన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు.
Tags:    

Similar News