ఏపీలో రీపోలింగ్ ఉన్నట్టా.. లేనట్టా..?

Update: 2019-04-25 16:44 GMT
ఏపీలోని మొత్తం  ఐదు నియోజకవర్గాల పరిధిలో సరిగ్గా బూత్ లలో రీ పోలింగ్ నిర్వహణకు కలెక్టర్ల నుంచి ఎన్నికల సంఘానికి నివేదికలు వెళ్లిన సంగతి తెలిసిందే. రీ పోలింగ్ విషయంలో కలెక్టర్లు పంపిన నివేదికల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వయంగా ప్రకటించారు. రీ పోలింగ్ కు ఆ మేరకు తమకు నివేదికలు వచ్చాయని ఆయన ప్రకటించారు.

అయితే ఆ విషయంలో తాము నిర్ణయం తీసుకునేది ఏమీ ఉండదని.. ఆ ప్రతిపాదనలను యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టుగా ఏపీ ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. ఇదంతా జరిగి ఇప్పటికే వారం అయినట్టుగా ఉంది.

అయితే ఇంత వరకూ రీ  పోలింగ్ విషయంలో ఎలాంటి హడావుడి లేదు. ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో.. ఇంకా రీ పోలింగ్ ఉన్నట్టా - లేనట్టా అనేది చర్చనీయాంశం అవుతూ ఉంది. ఈ విషయంలో తాజాగా ద్వివేదీ స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఆ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదన్నట్టుగా మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాకా ఆ అంశంలో నిర్ణయమని ప్రకటించారు.

ఇక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి కూడా ద్వివేదీ ప్రకటన చేశారు. కౌంటింగ్ కు ఇరవై ఒక్క వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఎవరు ఈ కౌంటింగ్ సెంటర్ కు పడతారనే అంశంపై సమాచారం ఆఖరు వరకూ రహస్యంగానే ఉంటుందని ఆయన ప్రకటించారు.
Tags:    

Similar News