ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త .. ఇక పై మేకిన్ ఇండియా ..ఎక్కడంటే ?

Update: 2020-07-27 12:30 GMT
స్మార్ట్ ఫోన్స్ ఎన్ని ఉన్నా , ఎన్ని ఫోన్స్ మర్కెట్స్ లో కి వచినా కూడా ఆపిల్ ఐ ఫోన్ కి ఉండే ప్రత్యేకత దేనికి ఉండదు. ఐఫోన్ అనేది ఓ స్టేటస్ లా చాలామంది భావిస్తారు. దేశంలో ఎక్కువగా అమ్ముడైయ్యే ఫోన్స్ ఐఫోన్స్. అయితే , ఇప్పటివరకు ఆ ఐఫోన్స్ అన్ని కూడా ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటూన్నాం. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. అతి త్వరలో ఆపిల్ ఐ ఫోన్ మేకిన్ ఇండియా మార్కెట్ లోకి రాబోతుంది.  ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్‌ ఐఫోన్ 11ను భారత్‌లో తయారు చేయనుంది. దీంతో గతం కంటే తక్కువ ధరకే ఐఫోన్లు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని తన ఉత్పత్తిని మొదలు పెట్టింది.

అమెరికా – చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఐఫోన్ భారత్ లో ఉత్పత్తిని షురూ చేసింది. మొత్తానికి  ఇన్నిరోజులకి  ఐఫోన్ మేడిన్ ఇండియా అని చూడబోతున్నాం. ఫాక్స్‌కాన్‌ ప్లాంట్లో ఫ్లాగ్‌షిప్‌ ఐఫోన్ 11ను తయారు చేయడం ప్రారంభించింది. ఆపిల్ ఐఫోన్11ను తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేయనుంది. ఆపిల్ ఐఫోన్‌ల దేశీయంగా తయారు చేయడం ప్రయోజనకరంగా మారనుంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్‌లో ప్రకటించారు.  మేడ్ ఇన్ ఇండియాలో ఇదో కీలకమైన పురోగతి అని ఆయన తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌ను తీసుకువస్తోందని ట్వీట్‌ చేశారు.

ఐఫోన్ ఎక్స్‌ ఆర్ స్మార్ట్‌ పోన్‌ అసెంబ్లింగ్‌ ప్రారంభించిన తొమ్మిది నెలల తర్వాత ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్ల తో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్ ‌ఫోన్‌ లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నైలో తయారయ్యే ఐఫోన్ల ధరలు త్వరలో భారీగా తగ్గబోతున్నాయి. అలాగే , దేశంలో ఇప్పటికే  శాంసంగ్.. షావోమి కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
Tags:    

Similar News