ఆపరేషన్ సిందూర్... ప్రెసిడెంట్ ని బంకర్లో దాక్కోమన్న పాక్ సైన్యం!

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ సిందూర్ ఆ దేశాన్ని ఏ స్థాయిలో వణికించిందనే సంగతి తెలిసిందే.;

Update: 2025-12-28 18:30 GMT

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ సిందూర్ ఆ దేశాన్ని ఏ స్థాయిలో వణికించిందనే సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్పు భారత్ నుంచి ప్రకటనలు రాగా.. భారత్ వైమానిక దాడిలో ధ్వంసమైన భవనాలపై కవర్లు కప్పి కవర్ చేసుకునే పనికి పూనుకుని ఆత్మవంచన చేసుకుంది పాక్. అయితే.. తాజాగా ఆపరేషన్ సిందూర్ తమ సైన్యాన్ని ఏస్థాయిలో వణికించిందో స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే చెప్పారు.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సైనిక చర్య జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం అది భారత్ – పాక్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. అయితే.. ఈ ఆపరేషన్ సిందూర్ సైనిక ప్రతీకార చర్య పాకిస్తాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ వెల్లడించారు.

శనివారం జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన జర్దారీ... జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గాంలో 26 మంది పౌరుల హత్యకు ప్రతిస్పందనగా ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ కింద భారత దళాలు ఖచ్చితమైన దాడులు చేయడంతో యుద్ధం ప్రారంభమైందని తన సైనిక కార్యదర్శి తనను హెచ్చరించారని అన్నారు. ఈ సందర్భంగా.. బంకర్లకు వెళ్దామని సూచించాడని చెప్పారు. అయితే ఆ సలహాను తాను తిరస్కరించానని జర్దారీ చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో భారత్ - పాక్ మధ్య ఉధృతి పెరుగుతుందని తాను రోజుల ముందుగానే ఊహించానని.. కానీ, బంకర్‌ లోకి వెళ్లమని సలహా ఇచ్చినప్పుడు మాత్రం తాను దానికి నిరాకరించానని జర్దారీ అన్నారు. దీంతో... ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో, ఆర్మీ అధికారుల్లో ఉన్న ఆందోళనను ఆయన వ్యాఖ్యలు వెల్లడించినట్లయ్యిందని అంటున్నారు. మరోవైపు ఆ సమయంలో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ మునీర్ సైతం బంకర్లలోకి వెళ్లినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

కాగా... పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన తర్వాత.. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ ను కొనసాగించిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా స్పందించిన భారత ఆర్మీ అధికారులు.. ఈ దాడులను ఖచ్చితమైనవి అభివర్ణించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం, మరిన్ని దాడులను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు!

ఈ నేపథ్యంలో భారత్ క్షిపణులు నేరుగా ఇస్లామాబాద్ ను తాకిన పరిస్థితి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన పాకిస్థాన్ ప్రభుత్వం... ఆ దేశ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ నుంచి భారత ప్రతినిధికి కాల్ చేయించి, కాల్పుల విరమణకు రిక్వస్ట్ చేయించింది. ఈ ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. పాక్ సేఫ్ అయిపోయింది!

Tags:    

Similar News